Rohit Sharma: టీమ్ ఇండియా వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్.. రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీనితో వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సారథ్యం వహించే అవకాశముంది. ఈ మేరకు అవసరమైన ఫిట్నెస్ టెస్టును తాజాగా క్లియర్ చేశాడు (Rohit Sharma clears fitness Test) హిట్‌మ్యాన్.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమిలో నిర్వహించిన పరీక్షల్లో రోహిత్ శర్మ పాసయ్యాడని బీసీసీఐ వర్గాలు బుధవారం (BCCI on Rohit Sharma) వెల్లడించాయి. ఈ విషయాన్ని వార్తా సంస్థ ఏఎన్ఐ ధృవీకరించింది.
గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్ దూరమైన (IND vs SA) సంగతి తెలిసిందే.
విడీస్తో సిరీస్ ఇలా..
వచ్చే నెల 6 నుంచి వెస్టిండీస్, భారత్ మధ్య 3 వన్డేలు, మూడు టీ20లు (IND vs WI) జరగనున్నాయి.
విండీస్‌తో మూడు వన్డేల సిరీస్ మ్యాచ్‌లు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి. ఇక మూడు టీ20 మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయని బీసీసీఐ గత శనివారమే (India in series against West Indies) ప్రకటించింది.
అయితే వెస్టిండిస్‌తో తలపడనున్న భారత జట్టుపై ఇంకా ప్రకటన చేయలేదు బీసీసీఐ. ఈ విషయంపై సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే జట్టు ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే (Team India squad for West Indies series) అవకాశముంది.
అయితే వెస్టీండీస్తో జరిగే మ్యాచ్‌లకు జస్ప్రిత్ బుమ్రాను (Jasprit Bumrah) రెస్ట్‌లో ఉంచే అవకాశముంది. భువనేశ్వర్, అశ్విన్‌లను ఎంపిక చేయడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకోకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మరి సెలెక్టర్లు ఇంకో అవకాశం ఇస్తారా? లేదా కొన్ని రోజులు రెస్ట్ ఇస్తారా? అనేది వేచి చూడాలి.
Also read: Lasith Malinga: శ్రీలంక జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ!
Also read: కోహ్లికి ఉన్నంత ఎనర్జీ ధోనికి లేదు... సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook