IND vs WI: ఇంగ్లండ్‌ను ఓడించాం.. తర్వాత టీమిండియానే! విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇక తమ దృష్టి ఇప్పుడు భారత్‌తో జరిగే సిరీస్‌లపై పెట్టామన్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 11:46 AM IST
  • ఇంగ్లండ్‌ను ఓడించాం.. తర్వాత టీమిండియానే
  • విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • భార‌త పర్య‌ట‌న‌పై దృష్టిసారిస్తాం
IND vs WI: ఇంగ్లండ్‌ను ఓడించాం.. తర్వాత టీమిండియానే! విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

Pollard says We will beat Rohit Sharma led India: వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇక తమ దృష్టి ఇప్పుడు భారత్‌తో జరిగే సిరీస్‌లపై పెట్టామన్నాడు. భారత జట్టు పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జ‌ట్టుతో ఆడడం త‌నకు చాలా ప్రత్యేకమైనది పొలార్డ్ తెలిపాడు. స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20ల‌ సిరీస్‌ను 3-2 తేడాతో వెస్టిండీస్ కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

బార్బడోస్ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (34), కీరన్ పొలార్డ్ (41), రోవ్మాన్ పావెల్ (35) పరుగులు చేశారు. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితం అయింది. వెస్టిండీస్‌ పేసర్‌ జేసన్‌ హోల్డర్‌ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

మ్యాచ్ అనంతరం విండీస్ సారథి కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.... 'సిరీస్ సాధించడం చాలా అద్భుతంగా ఉంది. ప్రతిఒక్కరు చాలా కష్టపడ్డారు. ఈ సిరీస్‌లో మాకు చాలా ప్రతికూల విషయాలు ఉన్నాయి. గేమ్‌ను ఎలా కొనసాగించాలనే దానిపై మాకు ఇప్పుడు అవగాహన ఉంది. మేము ఇంతకు ముందు చాలాసార్లు గెలుపొందడానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇది ఫైనల్ కాబట్టి పరుగులు చాలా కీలకం. 10-15 పరుగులను ఎక్కువగా చేయడం కలిసొచ్చింది. బ్యాటర్లు, బౌలర్లు బాగా రాణించారు' అని అన్నాడు. 

'ఇంగ్లండ్‌పై మేము సాధించిన టీ20 సిరీస్ అద్భుతం. ఇక ఇప్పుడు మేము భార‌త పర్య‌ట‌న‌పై దృష్టిసారిస్తాం. మేము ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియాపై కచ్చితంగా విజ‌యం సాధిస్తాం. మా టార్గెట్ మరో సిరీస్. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాతో ఆడ‌డానికి అతృత‌గా ఎదురు చూస్తున్నాం' అని కీరన్ పొలార్డ్ చెప్పాడు. ఐపీఎల్‌లో రోహిత్ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ తరఫున పొలార్డ్ ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్‌ 2022 మెగా వేలం ముందు పొలార్డ్‌ను ముంబై రీటైన్ చేసుకుంది.
Also Read: Covid 19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించిన 65 ఏళ్ల వ్యక్తి.. కారణం ఏం చెప్పాడో తెలుసా? నవ్వులే పో!!

Also Read: PMKMY pension scheme: పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన.. సన్నకారు రైతులకు నెలకు రూ.3000 పెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News