India vs West Indies: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా, వెస్టిండిస్ వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో.. టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 28 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది భారత్. ఆరు వికెట్ల తేడాతో సునాయాసంగా విజయ ఢంకా మొగించింది. భారత్‌కు ఈ మ్యాచ్ 1000వ వన్డే కావడం గమనార్హం.
మ్యాచ్ సాగిందిలా..
వెస్టిండీస్ టాస్ గెలిచి తొలు బ్యాటింగ్ చేసింది. అయితే భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. 43.5 ఓవర్లు ఆడినప్పటికీ.. 176 పరుగులు మాత్రం చేసి ఆలౌట్ అయ్యారు.
దీనితో స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన టీమ్ ఇండియా.. మరో 22 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించగలిగింది. 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి తిరుగులేని విజయాన్ని అందుకుంది.
ఎవరెవరు ఎలా ఆడారంటే..
విండీస్ ఆటగాళ్లలో జేసన్ హోల్డర్ అత్యధికంగా 57 (71) పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో ఫాబిన్ అలెన్ 29 (43) ఉన్నాడు. ఇక పురాన్, డారెన్ బ్రావో చెరో 18 పరుగులు చేశారు. ఇక మిగతా ఆటగాళ్లు 15 కన్నా తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరారు.
భారత బౌలర్లలో చాహల్ 4, వాషింగ్టన్ సుందర్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ 1 వికెట్ చొప్పున తీశారు.
భారత బ్యాటర్ల విషయానికొస్తే..
రోహగిత్ శర్మ 51 బంతుల్లో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీపక్ హుడా 32 బంతుల్లో 26 రన్స్ చేసి నౌటౌట్‌గా ఉన్నాడు. ఇషాన్ కిషన్ 36 బంతుల్లో 28 రన్స్‌కు వెనుదిరిగాడు. ఇక కోహ్లీ 4 బాల్స్ ఆడి 8 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 11 (9)కు అవుటయ్యాడు.
విండీస్ బౌలర్లలో.. అల్జారీ జోసెఫ్‌కు 2 వికెట్లు పడగా.. ఫాబిన్ అలెన్ ఓ వికెట్ తీశాడు.
Also read: Suresh Raina father Demise: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter