IND vs WI: విండీస్ పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు కరోనా!!

Dhawan, Shreyas and Ruturaj Gaikwad test positive for Covid 19: వెస్టిండీస్‌తో జరగనున్న పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ మరియు శ్రేయాస్ అయ్యర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 09:08 PM IST
  • భారత్ vs వెస్టిండీస్‌ సిరీస్‌
  • ముగ్గురు భారత స్టార్ ఆటగాళ్లకు కరోనా
  • సపోర్ట్ స్టాఫ్‌లో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు
IND vs WI: విండీస్ పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు కరోనా!!

Dhawan, Shreyas and Ruturaj Test Positive for Covid 19: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత జట్టులోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు బుధవారం నిర్వహించిన టెస్టుల్లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్టు ఓ సీనియర్ బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపారు. 

వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం జనవరి 31న అహ్మదాబాద్‌లో భారత జట్టు ప్లేయర్స్ అందరూ మూడు రోజుల ఐసోలేషన్‌కు వెళ్లారు. నిబంధనల ప్రకారం ఈరోజు ఆటగాళ్లందరికి కరోనా టెస్టులు చేయగా.. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్‌కు పాజిటివ్‌గా తేలింది. నాన్-కోచింగ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్‌లో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయట. సపోర్ట్ స్టాఫ్‌లో ఇద్దరు లేదా నలుగురికి కరోనా సోకిందని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం అందరూ ఐసోలేషన్‌లో ఉన్నారట. 

ఇటీవలి కాలంలో చాలామంది ప్లేయర్స్ కరోనా వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లకు బీసీసీఐ బ్యాక‌ప్‌గా మరో ఇద్దరు ఆటగాళ్లను తీసుకున్న విషయం తెలిసిందే. త‌మిళ‌నాడు స్టార్ ఆట‌గాళ్లు షారుక్ ఖాన్, సాయి కిషోర్‌ల‌ను బ్యాక‌ప్‌గా ఆటగాళ్లుగా భారత జట్టులోకి వచ్చారు. వన్డే సిరీస్ ఆరంభానికల్లా కరోనా బారిన ప్లేయర్స్ జట్టులోకి రాకపోయే అవకాశం ఉంది కాబట్టి..  వీరిద్దరూ భారత జట్టులోకి రానున్నారు. 

ఫిబ్రవరి 6న భారత్, వెస్టిండీస్ పర్యటన ఆరంభం కానుంది. ఆహ్మ‌దాబాద్ వేదిక‌గా తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఆపై ఫిబ్రవరి 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లోనే మరో రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీ20 సిరీస్ జరగనుంది. కరోనా నేపథ్యంలో మ్యాచులు రెండు వేదికల్లో మాత్రమే జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 6న జరగబోయే తొలి వన్డే.. భారత క్రికెట్​లో ఎంతో ప్రత్యేకమైనది. అది భారత జట్టు ఆడబోయే 1000వ వన్డే మ్యాచ్​.

Also Read: IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా? హైదరాబాద్‌కు నిరాశే!!

Also Read: DJ Tillu Trailer: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోసం.. బట్టలు చించేసుకున్న అల్లు అర్జున్! అసొంటి పాటే కావాలంటూ (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News