Kuldeep Yadav might happy as Kohli quits captaincy: టీమిండియా సారథిగా విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మొదట విరాట్ టీ20 కెప్టెన్సీ వదులుకోగా... ఆ తర్వాత బీసీసీఐ అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆ తర్వాత అందరినీ షాక్‌కి గురిచేస్తూ విరాట్ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అదే సమయంలో విరాట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం కొంతమంది క్రికెటర్లకు సంతోషాన్నిస్తుందని చెప్పక తప్పదేమో..! ఆ జాబితాలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడనే చెప్పాలి.
విరాట్ కెప్టెన్‌గా వైదొలగడం... టీమిండియా పగ్గాలు రోహిత్ చేతికి రావడంతో... కుల్దీప్ యాదవ్‌కు జట్టులోకి రీఎంట్రీ కన్ఫమ్ అయింది. ఇటీవల విండీస్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది. కుల్దీప్ యాదవ్ గత 6 నెలలుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. చివరిసారిగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో అతను టీమిండియా తరుపున ఆడాడు. నిజానికి కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ జోడి భారత బౌలింగ్ ఎటాక్‌లో కీలకంగా ఉన్నారు. అయితే సెలెక్టర్లు, కెప్టెన్ ఇన్నాళ్లు వారిని పక్కనపెడుతూ వచ్చారు. తాజాగా రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక కావడంతో కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కింది.
గతంలో ఎన్నో మ్యాచ్‌లలో కుల్దీప్ యాదవ్ టీమిండియా (Team India) విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ సెలెక్టర్లు, కెప్టెన్ అతన్ని పట్టించుకోలేదు. గతేడాది జరిగిన వరల్డ్ కప్‌లోనూ కుల్దీప్ యాదవ్ ఆడలేదు. గతంలో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో తన బౌలింగ్‌లోనూ కొన్ని మార్పులు చేసుకుని మరింత షైన్ అయ్యాడు. ఇప్పటివరకూ టీమిండియా తరుపున 65 వన్డేలు ఆడిన కుల్దీప్ యాదవ్ 107 వికెట్లు సాధించాడు. 8 టెస్టుల్లో 26 వికెట్లు, 21 టీ20 మ్యాచ్‌లలో 39 వికెట్లు సాధించాడు. త్వరలో విండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో స్వదేశీ పిచ్‌లపై కుల్దీప్ యాదవ్ మరోసారి చెలరేగే అవకాశం ఉంది.
Also Read: Corona in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు- జిల్లాల వారీగా వివరాలు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook