IND vs WI ODI Series 2022: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 6 నుంచి 11 మధ్య జరగనున్న మూడు వన్డేలకు ఇదే వేదిక కానుంది. అయితే ఈ వన్డే సిరీస్ కు ప్రేక్షకులను అనుమతించకూడదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఖాళీ స్టేడియాల్లోనే ఈ వన్డే సిరీస్ ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు గుజరాత్ క్రికెట్ ప్రకటించింది.
"మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఫిబ్రవరి 6వ తేదీ టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే.. వన్డేల్లో భారత జట్టుకు ఇది 1000వ మ్యాచ్. ఇన్ని మ్యాచ్ లు అడిన తొలి క్రికెట్ జట్టుగా టీమ్ఇండియా రికార్డు సృష్టించనుంది. అయితే ఈ స్పెషల్ మ్యాచ్ కు ప్రేక్షకులకు అనుమతి లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్ లు నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాం" అని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.
Considering the current situation, all the matches will be played behind the closed doors.
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) February 1, 2022
ప్రేక్షకులకు బంగాల్ ప్రభుత్వం అనుమతి
అహ్మదాబాద్ వేదికగా జరగనున్న వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో ఇరు జట్లు మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియాల్లోకి ప్రేక్షకులకు అనుమతించేందుకు పశ్చిమ బంగాల్ ప్రభుత్వం అనుమతించింది. 75 శాతం సీటింగ్ సామర్థ్యంతో క్రికెట్ ఫ్యాన్స్ ను స్టేడియాల్లోకి అనుమతించినట్లు బంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
వెస్టిండీస్ తో పరిమిత ఓవర్ల సిరీస్ జరగనున్న క్రమంలో ఇటీవలే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల సిరీస్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
టీమ్ఇండియా టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపిక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్.
టీమ్ఇండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్.
Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ 2022 వేలంలో పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి.. ఏ ప్రాంచైజీ అయినా ఆసక్తి చూపేనా?
Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియా అభిమానులకు శుభవార్త చెప్పిన బెంగాల్ ప్రభుత్వం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook