ఇండియా vs విండీస్ టీ20 ఇంటర్నేషనల్: తొలి టీ20 మ్యాచ్ ప్రివ్యూ వివరాలు

Last Updated : Nov 3, 2018, 10:13 PM IST
ఇండియా vs విండీస్ టీ20 ఇంటర్నేషనల్: తొలి టీ20 మ్యాచ్ ప్రివ్యూ వివరాలు

వెస్ట్ ఇండీస్‌తో జరగనున్న 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా ఈ టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ సైతం సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, టీ20ఇంటర్నేషనల్స్‌లో ఛాంపియన్‌గా దూసుకుపోతున్న వెస్ట్ ఇండీస్‌ని ఓడించి సిరీస్ సొంతం చేసుకోవడం అనేది జట్టుకు పెద్ద సవాలుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు క్రికెట్ నిపుణులు.

రేపటి తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడనున్న టీమిండియా ఆటగాళ్ల జాబితా:
రోహిత్ శర్మ (కెప్టేన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తిక్, మనీశ్ పాండే, క్రునాల్ పాండ్య, రిశబ్ పంత్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మెద్.

మ్యాచ్ వేదిక:
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఇంటర్నేషనల్ స్టేడియం.

తేదీ, సమయం:
నవంబర్ 4, ఆదివారం, రాత్రి 7 గంటలకు. 

ఏ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది:
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్ ఈ వన్డే మ్యాచ్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

మ్యాచ్ ప్రారంభమైన అనంతరం లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ కింది లింకును క్లిక్ చేయండి.
https://www.cricketcountry.com/series/west-indies-in-india-2018-200975/live-scores/india-vs-west-indies-1st-t20i-match-187768-summary.html

Trending News