Shahrukh Khan, Sai Kishore Added Indian Team: స్వదేశంలో వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు ఇప్పటికే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లను బీసీసీఐ జట్టులోకి ఎంపిక చేసింది. తమిళనాడు స్టార్ ఆటగాళ్లు షారుక్ ఖాన్, సాయి కిషోర్‌లను బ్యాకప్‌గా బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. టీ20లకు వీరు కొనసాగనున్నారు. అయితే వీరిద్దరు ప్రస్తుతం ప్రధాన జట్టులో భాగం కాలేరు.
ఇటీవలి కాలంలో చాలామంది ప్లేయర్స్ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దాంతో ఒక్కోసారి ప్లేయింగ్ 11ను ఎంచుకోవడం కూడా కష్టంగా మారుతుంది. తాజాగా అండర్-19 ప్రపంచకప్ 2022లో టీమిండియాకు ఇదే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి ఆటంకాలు రాకూడని భావించిన బీసీసీఐ.. ముందస్తుగా షారుక్ ఖాన్, సాయి కిషోర్‌లను బ్యాకప్‌గా తీసుకుంది. ఒకవేళ భారత జట్టులోని ఎవరైనా గాయపడ్డా లేదా వైరస్ బారిన పడినా వీరు జట్టులోకి వస్తారు. ఏదేమైనా షారుక్, కిషోర్‌లు బంపర్ ఆఫర్ పట్టేశారు.
షారుఖ్ ఖాన్ తమిళనాడుకు చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్. ఒకే ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్నవాడు. భారీ షాట్లతో అలరిస్తాడు. దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్‌లో ఇప్పటికే నిరూపించుకున్నాడు. సాయి కిషోర్ మంచి బౌలర్. ఐపీఎల్‌లో బాగా బౌలింగ్ చేశాడు. తమిళనాడు నుంచి ప్రస్తుతం వన్డే జట్టులో ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. షారుఖ్, కిషోర్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ వెస్టిండీస్‌తో తలపడే భారత వన్డే జట్టులో ఉన్నాడు.
భారత వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మొహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా.
Also Read: H-1B Visa: మార్చి నుంచి హెచ్-1బీ వీసాలకు రిజిస్ట్రేషన్- పూర్తి వివరాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook