రక్షణ వలయంగా తెలంగాణ : డీజీపీ మహేందర్ రెడ్డి

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని, చట్టాలను ఉల్లంఘించిన వారికి శిక్షలు పడుతున్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తప్పు చేసినా వారికి శిక్షలు పడే విదంగా పోలీసులు నమ్మకం కల్పించాలని, నేరం చేసిన వారిని గుర్తించాలని, కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Last Updated : Feb 14, 2020, 11:28 AM IST
రక్షణ వలయంగా తెలంగాణ : డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని, చట్టాలను ఉల్లంఘించిన వారికి శిక్షలు పడుతున్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తప్పు చేసినా వారికి శిక్షలు పడే విదంగా పోలీసులు నమ్మకం కల్పించాలని, నేరం చేసిన వారిని గుర్తించాలని, కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. 

పూర్తి స్థాయి ఆధారాలతో నిందితులకు శిక్షలు పడే విధంగా పని చేయాలని, నేరం చేస్తే దొరికిపోతాం అనే విధంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా కేసులలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని, రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.  

మరోవైపు హజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష అమలు కావడంలో ప్రతి ఒక్కరి కృషి మరవలేనిదని, సాక్ష్యాలను సేకరించి నిందితునికి 90 రోజుల్లో శిక్ష అమలు అయ్యేలా పోలీసు అధికారులు పని చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్  అన్నారు. 

ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 143 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, ఇందులో 2 కేసుల్లో ఇద్దరికి ఉరిశిక్ష ఖరారు అయ్యిందని, అదేవిధంగా 4 కేసుల్లో జీవితకాలం శిక్ష  ఖరారు అయిందని అన్నారు. ఈ కమిషనరేట్ పరిధిలో 34 శాతం కన్విక్షన్ రేట్ పెరిగిందని, హజీపూర్ కేసులో హైకోర్టులో అన్నీ విధాలుగా ఎదుర్కొంటామని మహేష్ భగవత్ తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News