Shabbir Ali: దేశంలో ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్షాలు సీఏఏను వ్యతిరేకిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేత వైఖరి మరోలా ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Pak Cricketer: సీఏఏను అమలు చేయాలని కేంద్ర తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఈ నిర్ణయంతో పాకిస్తాన్లో ఉంటున్న హిందూవులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారని తన ఆనందాన్ని పంచుకున్నాడు.
CAA Controversy: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకురావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సీఏఏ అమలుకు వ్యతిరేకంగా అందరూ గళం విప్పుతున్నారు. ఇప్పుడు తమిళ అగ్రనటుడు విజయ్ కూడా సీఏఏను వ్యతిరేకిస్తూ గళం విప్పారు.
CAA 2019 Rules: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇకపై బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని ముస్లిమేతరులకు ఇండియా పౌరసత్వం కల్పించనుంది. పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరెవరు అర్హులనే వివరాలు తెలుసుకుందాం.
CAA Protest: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఏఏ అమలుపై తమకు అభ్యంతరాలున్నాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
Citizenship Amendment Act Full Details: పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల క్రితం పార్లమెంట్ పొందిన ఈ బిల్లును కేంద్రం తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది. సీఏఏ అంటే ఏమిటి..? ఈ చట్టం అమలుతో ఎవరికి ఇబ్బంది కలుగుతుంది..?
CAA Rules: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం మరోసారి వివాదాన్ని రేపనుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఏఏను నోటిఫై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Citizenship Amendment Act: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం అమల్లో వచ్చింది. ఆరుగురు పాకిస్తాన్ శరణార్ధులకు పౌరసత్వం లభించింది. చాలాకాలంగా ఇండియాలో జీవిస్తున్న ఆరుగురికి దేశ పౌరసత్వం కల్పించినట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
Assam Election Manifesto: అస్సాం ఎన్నికలకు బీజేపీ ప్రచారాస్త్రం సిద్ధం చేసింది. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం ప్రధానాంశంగా మేనిఫెస్టో రూపొందించింది.
Assam elections: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరోసారి పౌరసత్వ సవరణ చట్టం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సీఏఏను నిలిపివేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. అసోం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తోంది.
Assam Elections: అస్సోంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. పౌరసత్వ సవరణ చట్టం కాంగ్రెస్ పార్టీకు ప్రచారాస్త్రంగా మారింది. అధికారంలో వస్తే సీఏఏను ఎప్పటికీ అమలు కానివ్వమంటోంది కాంగ్రెస్ పార్టీ.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
బీహార్ ఎన్నికల ప్రచారం నేపధ్యంలో నేతల మధ్య విమర్శల తీవ్రత పెరుగుతోంది. సీఏఏ మరోసారి చర్చకొచ్చింది. ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్, మజ్లిస్ నేత ఒవైసీల మధ్య ఇదే విషయంపై అగ్గి రాజుకుంది.
పౌరసత్వ సవరణ చట్టంను త్వరలో అమలు కానుంది. ఏళ్ల తరబడి భారతీయ పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న ముస్లిమేతర శరణార్ధుల కల నెరవేరబోతోంది. భారతీయ జనతా పార్టీ ఛీఫ్ జేపీ నడ్డా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ (Time magazine) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో సహా ఐదుగురు స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ జాబితాలో షహీన్ బాగ్ ఉద్యమకారిణి 82 ఏళ్ల బామ్మ బిల్కిస్ బానో కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
జేఎన్యూ విద్యార్థి నేత, కార్యకర్త ఉమర్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ (Umar Khalid Arrested) చేశారు. సుదీర్ఘంగా ఉమర్ ఖలీద్ను పోలీసులు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
మూడు దశాబ్దాలుగా భారత్ లోనే నివసిస్తున్నారు. అయినా నిత్యం వీసా రెన్యువల్ చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తమకు కూడా భారత దేశ పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నారు ఆ విదేశీ సంతతి ఇండియన్లు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.