Corona updates: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 209 రోజుల కనిష్ఠానికి దిగొచ్చింది. కొత్తగా 18,346 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వైరస్ తో 263 మంది ప్రాణాలు కోల్పోయారు.
Covid cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ 20 వేలు దాటింది. కొత్తగా 23,529 పాజిటివే కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 311 మంది మృతి చెందారు. ఒక్కరోజే 28,718 మంది కొవిడ్‌ను జయించారు.
Sunlight May Lower Risk Of Covid-19 Deaths | ఎండలో బయటతిరిగే వారిలో, ప్రతిరోజూ కొంత సమయం ఎండలో ఉండే వ్యక్తులలో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉందట. ఈ విషయాన్ని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ పబ్లిష్ చేసింది.
కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా మహమ్మారి వ్యాప్తితో పాటు మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 10,000 (Tamil Nadu Surpass 10,000 COVID-19 deaths)కు చేరుకుంది.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 11 మంది కరోనావైరస్తో ( Coronavirus ) బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో మొత్తం 58,052 కరోనా శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. 7,998 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నేడు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 762 కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదలైన కోవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం కరోనావైరస్ కారణంగా ఇవాళ ఎనిమిది మంది మృతి చెందారు.
తెలంగాణలోని నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ( Govt General Hospital ) లో దారుణం చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో సమయానికి ఆక్సిజన్ అందక నలుగురి నిండు ప్రాణాలు బలయ్యాయి. సమయానికి ఆక్సిజన్ అందించలేదని, వైద్యులు పట్టించుకోకపోవడంతోనే నలుగురు రోగులు చనిపోయారని ఆరోపిస్తూ మృతుల కుటుంబసభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో గురువారం కొత్తగా 1,410 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే అందులోనూ జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే మొత్తం 918 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది.
హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం కొత్తగా 1879 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,220 శ్యాంపిళ్లను పరీక్షించగా.. 1879 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రోజూలాగే ఇవాళ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ( GHMC ) అత్యధికంగా 1,422 కేసులు నమోదయ్యాయి.
COVID-19 in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 15,188 నమూనాలపై కోవిడ్-19 పరీక్షలు చేయగా.. 275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తేలింది. వీళ్లంతా స్థానికులే కాగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలోనూ కొత్తగా మరో 76 మందికి కరోనా సోకింది.
Coronavirus in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో గుర్తించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల వివరాలపై ఏపీ సర్కార్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల ( Health bulletin) చేసింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు మొత్తం 15,911 బ్లడ్ శాంపిల్స్‌పై కోవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests) జరపగా.. అందులో 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 253 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus) నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 15,633 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) అందులో 253 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.
COVID-19 tests | హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై కేంద్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు ( Bandi Sanjay ). మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనావైరస్ టెస్టులు సరిగా చేయడం లేదని, కరోనాపై యుద్ధం చేస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఇతర అధికారులకు పిపిఈ కిట్లు అందించడంలోనూ జాప్యం చోటుచేసుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు.
కరోనావైరస్ నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నిన్న మే11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతికి సందేశం ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. మే 17తో ప్రస్తుత లాక్ డౌన్ ( Lockdown ) గడువు ముగిసిపోనున్న ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి 8 గంటలకు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత్‌ని గడగడలాడిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సరైన అవగాహన లేకున్నా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలనిస్తూ పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.