Gurumurthy Case: సంక్రాంతికి వస్తున్నాం చూసి పక్కా ప్లానింగ్ తో మర్డర్.. గురుమూర్తి కేసులో సంచలన నిజాలు..!

Sankranthiki Ki Vastunnam Movie : సాధారణంగా సినిమా ప్రభావం ప్రజల పైన ఎంతలా పడుతోంది అంటే, ఏకంగా సినిమాలు చూసి హత్యలకు పాల్పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా సమాజానికి మంచి చేకూర్చేలా సందేశాన్ని ఇస్తుంటే. కొంతమంది దానిని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 23, 2025, 11:18 AM IST
Gurumurthy Case: సంక్రాంతికి వస్తున్నాం చూసి పక్కా ప్లానింగ్ తో మర్డర్.. గురుమూర్తి  కేసులో సంచలన నిజాలు..!

Gurumurthy Case Shocking Details: ఈ సంక్రాంతి సందర్భంగా బడా హీరోలు తమ సినిమాలతో పోటీపడ్డారు. అందులో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని, కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. అంతేకాదు వెంకటేష్ సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. ఈ సినిమా ట్రయాంగిల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందులోని కొన్ని అంశాలను ఆధారంగా తీసుకొని గురుమూర్తి అనే వ్యక్తి హత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్ లోని మీర్పేట్ లో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు  వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు గురు మూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారించగా విస్తుపోయే నిజాలు బయటకి వచ్చాయి. ఇక పోలీసుల ముందు గురుమూర్తి తెలిపిన వివరాల మేరకు, 14వ తేదీ తన భార్య, పిల్లలతో కలిసి వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళాము.  ఆ తర్వాత పిల్లలను వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాము. అయితే ఆ సమయంలో నా భార్య నాతో గొడవ పెట్టుకుంది. తాళి తీసి నా మొహాన విసిరేసింది. వెంటనే గోడకు ఆమెను అదిమీ కొట్టాను. స్పృహ తప్పి పడిపోయింది అనుకున్నాను కానీ ఆమె చనిపోయింది. ఇక శవం మాయం చేయాలని ప్లాన్ చేశాను.

ఇక అందులో భాగంగానే రెండు కత్తులు తీసుకొని శరీరంలోని మెత్తటి భాగాలు కోసేసి, వాటర్ హీటర్ ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి ముక్కల్ని అందులో వేశాను. 6 గంటల పాటు ఉడికించి,  ఉడికిన వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశాను.  ఆ తర్వాత ఎముకలను బూడిద అయ్యేవరకు కాల్చాను మొత్తం బూడిద చేసి రెండు బకెట్లలో తీసుకొని చెరువులో పడేసాను అంటూ గురుమూర్తి తెలిపారు.

ఇంట్లో రక్తం కనపడకుండా ఫినాయిల్ తో క్లీన్ చేశాను అని గురుమూర్తి తెలిపాడు. మొత్తానికి అయితే గురుమూర్తి చెప్పిన దాన్ని తర్వాత పోలీసులు ఆధారాల కోసం వెతకగా ఒక్కటి కూడా దొరకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం కుక్కర్, కత్తులు, హీటర్ బకెట్లతో వస్తువులను ఫోరెన్సిక్ టీమ్ తో తనిఖీ చేయిస్తున్నారు. ఏది ఏమైనా సినిమా చూసిన తర్వాత భార్యను ఎలా  హత్య చేశానని చెబుతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గురుమూర్తి పోలీసులతో బెదిరింపులకు దిగుతూ మీ సంగతి కోర్ట్ లో చూసుకుంటానని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు 'కొత్త టెన్షన్‌'.. రిటైర్మెంట్‌ వయస్సు 65 ఏళ్లకు పెంపు?

Also Read: K Kavitha: 'రేవంత్‌ రెడ్డికి ఏటీఎంలా మూసీ ప్రాజెక్టు.. ఢిల్లీకి డబ్బుల మూటలు తరలించే కుట్ర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News