Telangana: 30 వేలు దాటిన కరోనా కేసులు

COVID-19 cases: హైదరాబాద్‌: తెలంగాణలో గురువారం కొత్తగా 1,410 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే అందులోనూ జీహెచ్‌ఎంసీ ( GHMC ) పరిధిలోనే మొత్తం 918 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది.

Last Updated : Jul 9, 2020, 11:54 PM IST
Telangana: 30 వేలు దాటిన కరోనా కేసులు

COVID-19 cases: హైదరాబాద్‌: తెలంగాణలో గురువారం కొత్తగా 1,410 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే అందులోనూ జీహెచ్‌ఎంసీ ( GHMC ) పరిధిలోనే మొత్తం 918 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin ) విడుదల చేసింది. నేడు గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల విషయానికొస్తే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 918 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్‌ జిల్లాలో 67, సంగారెడ్డి జిల్లాలో 79, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో  34, కరీంనగర్‌లో 32 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23, నల్లగొండ జిల్లాలో 21, నిజామాబాద్‌ జిల్లాలో 18, మెదక్‌ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12,  సూర్యాపేట జిల్లాలో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి. అలాగే మహబూబ్‌ నగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 8 చొప్పున, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 7, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 6, వికారాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాలో 5 చొప్పున, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, వనపర్తి, గద్వాల జిల్లాల్లో 2 చొప్పున జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన (Coronavirus ) పడిన వారి సంఖ్య 30,946 కు చేరుకుంది. ( Also read: ఏపీలో కరోనా పంజా.. రికార్డు కేసులు )

గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 331 మంది కరోనావైరస్ నుంచి కోలుకోగా డిశ్చార్జ్ కాగా.. మరో ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటివరకు 18,192 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జికాగా... కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 331 కి చేరుకుంది ( COVID-19 deaths ). ప్రస్తుతం 12,423 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 5,954 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు తెలంగాణలో 1,40,755 మందికి కోవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests ) జరిపారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    

Trending News