Inida Covid cases today: దేశంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ వేరియంట్ కేసులు ఆరు వందల మార్కును క్రాస్ చేశాయి. వైరస్ తో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Telangana Covid Update: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది.
Covid-19 Updates: దేశంలో కరోనా చారలు చాస్తోంది. తాజాగా 9,111 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 27 మంది ప్రాణాలు విడిచారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.
Kappa variant cases reported in UP: లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో మరోసారి కప్ప వేరియంట్ కేసులు గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో జరిగిన రెగ్యులర్ రివ్యూ మీటింగ్ అనంతరం అమిత్ మోహన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర్ ప్రదేశ్‌లో రెండు కప్ప వేరియంట్ కేసులు (Kappa variant cases) నమోదైనట్టు పేర్కొన్నారు.
Corona Cases in Telangana: తెలంగాణలో గురువారం కొత్తగా 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనావైరస్ కారణంగా నలుగురు మృతి చెందినట్టు తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 993 మంది కరోనావైరస్ నుండి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Covid-19 latest updates from across India: న్యూఢిల్లీ : హోలీ పండగ కంటే ముందే కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెరుగుతున్న కరోనావైరస్ కేసులు ప్రజానీకాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికార యంత్రాంగాలు సైతం ఆంక్షలు కఠినతరం చేశాయి. ఇంకొన్ని చోట్ల మళ్లీ లాక్డౌన్ లేదా నైట్ కర్ప్యూ (Lockdown or night curphew) పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అదే సమయంలో మార్చి 29న జరగనున్న హోలీ పండగపై (Holi festival 2021) కూడా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి.
PM Narendra Modi: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్, అన్‌లాక్ వంటి అంశాలపై మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ భారతీయులకు మరింత స్పష్టత ఇవ్వనున్నారు.
COVID-19 in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు గత 24 గంటల్లో 15,188 నమూనాలపై కోవిడ్-19 పరీక్షలు చేయగా.. 275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తేలింది. వీళ్లంతా స్థానికులే కాగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలోనూ కొత్తగా మరో 76 మందికి కరోనా సోకింది.
Coronavirus in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో గుర్తించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల వివరాలపై ఏపీ సర్కార్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల ( Health bulletin) చేసింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు మొత్తం 15,911 బ్లడ్ శాంపిల్స్‌పై కోవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests) జరపగా.. అందులో 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
TRS MLA Bigala Ganesh Gupta | హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ని కరోనావైరస్ వేధిస్తుండగా తాజాగా వారి జాబితాలో మరో ఎమ్మెల్యే వచ్చి చేరారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బిగాల గణేష్ గుప్తాకు కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 253 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus) నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 15,633 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) అందులో 253 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.
Bonalu festival 2020 | హైదరాబాద్ : కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాలను (Bonalu) నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25 వ తేదీ నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది.
కరోనావైరస్ పాజిటివ్‌తో 69 ఏళ్ల డాక్టర్ చనిపోయిన ఘటన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో చోటుచేసుకుంది. షిల్లాంగ్‌లో బెతానీ ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉన్న డా జాన్ సైలో కరోనాతో మృతి చెందగా.. అదే కుటుంబానికి చెందిన మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళనకు దారితీస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాట్‌స్పాట్స్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి కొత్తగా ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా అని తెలుసుకునేందుకు దశల వారీగా అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
లాక్ డౌన్ కారణంగా విద్యార్థులకు సంబంధించి పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, వాయిదా పడిన ఆ పరీక్షల సంగతేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుండటంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
కరోనా వైరస్ నివారణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, మందులను వ్యాపార సంస్థలు బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.