Bandi Sanjay: తెలంగాణ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు

COVID-19 tests | హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై కేంద్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు ( Bandi Sanjay ). మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనావైరస్ టెస్టులు సరిగా చేయడం లేదని, కరోనాపై యుద్ధం చేస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఇతర అధికారులకు పిపిఈ కిట్లు అందించడంలోనూ జాప్యం చోటుచేసుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు.

Last Updated : Jun 8, 2020, 08:16 PM IST
Bandi Sanjay: తెలంగాణ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు

COVID-19 tests | హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై కేంద్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు ( Bandi Sanjay ). మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనావైరస్ టెస్టులు సరిగా చేయడం లేదని, కరోనాపై యుద్ధం చేస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఇతర అధికారులకు పిపిఈ కిట్లు అందించడంలోనూ జాప్యం చోటుచేసుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కునే విషయంలో తెలంగాణ సర్కార్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. కరోనా సోకిన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం లేదని.. ఐసీఎంఆర్ గైడ్‌లెన్స్‌ను ( ICMR guidelines ) రాష్ట్ర ప్రభుత్వం పాటించక పోవడం తదితర అంశాలను కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. COVID-19 tests: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ )

తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ చర్యలు ఏమీ చేపట్టడం లేదు. కోవిడ్-19 పరీక్షల విషయంలో ఐసిఎమ్మార్ జారీ చేసిన మార్గదర్శకాలను తెలంగాణ సర్కారు తుంగలో తొక్కుతోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనావైరస్‌కి చికిత్స పొందుతున్న రోగులకు సరైన వైద్య సౌకర్యాలు లేవని స్వయంగా బాధితులే చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం గాంధీలో సౌకర్యాలు లేవనే విషయాన్ని బయటికి రానివ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారని.. ఆఖరికి కరోనాతో చనిపోయిన వారి వివరాలను సైతం ప్రభుత్వం వెల్లడించకపోవడం దారుణం అని బండి సంజయ్ మండిపడ్డారు. కరోనావైరస్ కట్టడి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సైతం తెలంగాణ సర్కారు సరిగ్గా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. పక్క రాష్ట్రాలు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేసి కరోనావైరస్ కేసులు, మృతుల వివరాలు, ఇతర గణాంకాలను వెల్లడిస్తున్నప్పటికీ.. కేసీఆర్ సర్కారు మాత్రం ఆ వివరాలను దాచిపెడుతోందని అన్నారు. BRKR Bhavan: తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం )

ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావించిన బండి సంజయ్.. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోన్న జర్నలిస్టులకు సైతం సరైన భద్రత లేకుండా పోయిందన్నారు. పాత్రికేయులకు సంబంధించిన ప్రత్యేక చర్యలపై దృష్టి సారించాలని అన్నారు. కరోనాతో టీవీ5 జర్నలిస్ట్ మనోజ్ మృతి చెందిన తీరు అందరిని భయ భ్రాంతులకు గురిచేసిందని ఆందోళన వ్యక్తంచేశారు. 

తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధివిధానాల కారణంగా కరోనాపై యుద్ధంలో పాల్గొంటున్న ప్రభుత్వ వైద్యులు, నర్సులు, పిజి వైద్య విద్యార్థులకు సరైన భరోసా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతమంది ప్రభుత్వ డాక్టర్లకు పిపిఈ కిట్స్ అందించారో లెక్కలతో సహా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ డిమాండ్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News