COVID-19 updates: 24 గంటల్లో 253 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 253 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus) నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు  15,633 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) అందులో 253 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది.

Last Updated : Jun 14, 2020, 08:11 PM IST
COVID-19 updates: 24 గంటల్లో 253 కరోనా పాజిటివ్ కేసులు

COVID-19 in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో చివరి 24 గంటల్లో 253  కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus) నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు  15,633 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) అందులో 253 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్-19 బారినపడిన వారి సంఖ్య మొత్తం 6,152 కు చేరింది. మొత్తం కేసులలో 204 మందిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిగా గుర్తించగా మరో 1107 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 82 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 2723 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2034 యాక్టివ్ కేసులున్నాయి.  Telangana: కరోనావైరస్ వ్యాప్తి నివారణకు ముఖ్యమైన సమాచారం ) 

ఆదివారం నాటి హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 84 కు చేరింది. తూర్పు గోదావరి జిల్లాలోని అయినవిల్లి, రాయవరం మండలాలను కరోనా వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రెండు మండలాల్లో కరోనా కేసులు పెరుగుతుండటమే అందుకు కారణమైంది. రాయవరం మండలం చెల్లూరులో కొత్తగా 26 మందికి కరోనా నిర్థారణ అయింది. దీంతో కేవలం ఆ గ్రమంలోనే కరోనా బాధితుల సంఖ్య 40కి చేరింది. వీళ్లంతా కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన వారేనని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News