Telangana: కరోనా పాజిటివ్ కేసులపై లేటెస్ట్ అప్‌డేట్

హైదరాబాద్‌ : తెలంగాణలో మంగళవారం కొత్తగా 1879 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు ( Coronavirus cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,220 శ్యాంపిళ్లను పరీక్షించగా.. 1879 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. రోజూలాగే ఇవాళ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ( GHMC ) అత్యధికంగా 1,422 కేసులు నమోదయ్యాయి. 

Last Updated : Jul 8, 2020, 06:35 AM IST
Telangana: కరోనా పాజిటివ్ కేసులపై లేటెస్ట్ అప్‌డేట్

హైదరాబాద్‌ : తెలంగాణలో మంగళవారం కొత్తగా 1879 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు ( Coronavirus cases ) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,220 శ్యాంపిళ్లను పరీక్షించగా.. 1879 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. రోజూలాగే ఇవాళ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ( GHMC ) అత్యధికంగా 1,422 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,422, రంగారెడ్డి జిల్లాలో 176, మెడ్చల్‌ జిల్లాలో 94, కరీంనగర్‌ జిల్లాలో 32, నల్లగొండ జిల్లాలో 31, నిజామాబాద్‌ జిల్లాలో 19, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 13, మెదక్‌, ములుగు జిల్లాల్లో 12 కేసుల చొప్పున,  మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 9 చొప్పున, కామారెడ్డి జిల్లాలో 7, గద్వాల జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి ( District wise COVID-19 cases ) . ( Also read: Telangana: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌కు రేవంత్ రెడ్డి డిమాండ్ )

ఇవేకాకుండా పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 3 కేసుల చొప్పున, జగితాల్య, మహబూబాబాద్‌, రాజన్నసిరిసిల్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 2కేసుల చొప్పున, వనపర్తి, సిద్దిపేట, ఆదిలాబాద్ జనగామ, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ( Health bulletin ) స్పష్టంచేసింది. ( Also read: Telangana: ప్రైవేట్ ఆసుపత్రులపై హైకోర్టు ఆగ్రహం )

ఇప్పటివరకు రాష్ట్రంలో 27,612 మందికి కరోనా సోకగా.. ప్రస్తుతం 11,012 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరో 16,287 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మంగళవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందారు ( Coronavirus deaths ). దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 313 కు చేరింది.  ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,28,438 మందికి కోవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests ) చేశారు. Also read: Telangana: తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేత ప్రారంభం

Trending News