Corona cases in India: దేశంలో 23వేలు దాటిన కరోనా కేసులు..మరణాల్లో సగం కేరళలోనే..

Covid cases in India: దేశంలో రోజువారీ కరోనా​ కేసుల సంఖ్య  మళ్లీ 20 వేలు దాటింది. కొత్తగా 23,529 పాజిటివే కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 311 మంది మృతి చెందారు. ఒక్కరోజే 28,718 మంది కొవిడ్​ను జయించారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2021, 12:27 PM IST
  • దేశంలో 23వేలు దాటిన కరోనా కేసులు
  • వైరస్ తో 311 మంది మృతి
  • నిన్న ఒక్కరోజే 28,718 మంది రికవరీ
Corona cases in India: దేశంలో 23వేలు దాటిన కరోనా కేసులు..మరణాల్లో సగం కేరళలోనే..

Covid cases in India: దేశంలో రెండు రోజులుగా 20వేల దిగువకు పడిపోయిన కరోనా కేసులు(Corona Cases).. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.06లక్షల మందికి వైరస్‌ పరీక్షలు(Covid-19 Tests) నిర్వహించగా.. 23,529 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కేసుల (18,870)తో పోలిస్తే 24శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి.

సగం మరణాలు కేరళలోనే..
మరణాలు కాస్త తగ్గముఖం పట్టడం ఊరటనిస్తోంది. అంతక్రితం రోజు 378 మంది కరోనాతో మరణించగా.. నిన్న ఆ సంఖ్య 311గా ఉంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల(Corona Cases) సంఖ్య 3.37కోట్లు దాటగా.. ఇప్పటి వరకు 4,48,062 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది. కొత్తగా నమోదైన మరణాల్లో సగం ఒక్క కేరళ(Kerala)లోనే వెలుగుచూడటం గమనార్హం. నిన్న ఆ రాష్ట్రంలో 12,161 కొత్త కేసులు నమోదవ్వగా.. 155 మంది కరోనాతో మరణించారు. 

Also Read: Coronavirus New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ జాడ ఇండియాలో ఉందా లేదా

ఇదిలా ఉండగా.. కొత్త కేసుల కంటే రికవరీలు(Recovery Cases) ఎక్కువగా ఉంటుండటం సానుకూలాంశం. నిన్న మరో 28,718 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 3.30కోట్ల మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.85శాతానికి పెరిగింది. ఇక, కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.82శాతంగా ఉంది. రోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌(Vaccination) ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం మరో 65,34,306 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 88.34కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విస్తరణ (Global corona virus update) కొనసాగుతోంది. కొత్తగా 4,85,872 మందికి కరోనా (Corona update) సోకినట్లు తేలింది. మహమ్మారి​ ధాటికి మరో 8,758 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,40,57,967కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,88,218కి పెరిగింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News