PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం

Employees JAC Demands For Pay Revision Committee And Other Demadns: వేతన సవరణ సంఘం క‌మిటీ నివేదిక‌ను వెంట‌నే ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది. వాటితోపాటు అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 23, 2025, 08:51 AM IST
PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం

Pay Revision Committee: వేతన సవరణ సంఘం కమిటీ నివేదిక త్వరగా ప్రభుత్వానికి సమర్పించి మేలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ లచ్చిరెడ్డి డిమాండ్‌ చేశారు. వాటితోపాటు పెండింగ్‌ డీఏలు, పాతన పింఛన్‌ విధానం అమలు వంటి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై కూడా లచ్చిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేశారు.

Also Read: Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు 'కొత్త టెన్షన్‌'.. రిటైర్మెంట్‌ వయస్సు 65 ఏళ్లకు పెంపు?

 

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స‌మావేశం బుధ‌వారం హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అనంతరం భార్య‌భ‌ర్త‌ల‌, వితంతువుల‌, దివ్యాంగుల‌, మెడిక‌ల్ కేట‌గిరి కింద ఉద్యోగుల‌ను జోన్స్ ట్రాన్స్‌ఫ‌ర్స్‌, ప‌ర‌స్ప‌ర‌, ఎన్నిక‌ల బ‌దిలీల‌ను చేసినందుకు జేఏసీ ప్రభుత్వానికి కృత‌జ్ఙ‌త‌లు తెలిపింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్‌ను ర‌ద్దు చేసి పాత పెన్ష‌న్ విధానం వెంట‌నే అమ‌లు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నిక‌ల కోసం బ‌దిలీ చేసిన త‌హసీల్దార్ల‌ను వెంట‌నే సొంత శాఖకు పంపించాల‌ని కోరారు.

Also Read: Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. పదవీ విరమణ వయస్సు తగ్గించాలని జేఏసీ ఆందోళన

 

ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్‌, సెలవు జీతం, మెడిక‌ల్ రీయంబర్స్‌మెంట్ బిల్లుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది. బకాయి పడిన వాహ‌న ర‌వాణా భ‌త్యాల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని కోరింది. న్యాయ‌మైన డిమాండ్లను పరిష్కరించడానికి దశ‌ల వారీగా కృషి చేస్తామని జేఏసీ తెలిపింది. ఈ  స‌మావేశంలో చేసిన ప‌లు తీర్మానాల‌ను జేఏసీ వెల్ల‌డించింది.

జేఏసీ తీర్మానాల్లో కొన్ని..

  • హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌, ఇత‌ర లోన్స్ అడ్వాన్స్‌‌ను పెంచాలి.
  • ఈ-కుబీర్‌లో  రూ.10 ల‌క్ష‌ల లోపు పెండింగ్ బిల్లుల‌ను త‌క్ష‌ణమే విడుద‌ల చేయాలి.
  • ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లో మౌళిక స‌దుపాయాలను క‌ల్పించాలి. ఇందుకు కావాల్సిన‌ బ‌డ్జెట్‌ను పెంచాలి.
  • ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉద్యోగుల‌కు అదే రోజునే వారి పెన్ష‌న్ బినిఫిట్స్‌ను అందించాలి.
  • అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామ‌కానికి ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయాలి.
  • ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ సీలింగ్‌ను 300 రోజుల నుంచి 360 రోజుల‌కు పెంచాలి.
  • ఉద్యోగుల‌కు డ్యూటీ నైపుణ్యాల‌ను పెంపొందించుట‌కు ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో శిక్ష‌ణ ఏర్పాటు చేయాలి.
  • వివిధ కేడ‌ర్‌లోని రెవెన్యూ ఉద్యోగుల‌కు ట్రైనింగ్ కొర‌కు రెవెన్యూ అకాడ‌మీని ఏర్పాటు చేయాలి.
  • సెక్ష‌న్ 197 ఆఫ్ సీఆర్‌పీసీ ప్ర‌కారం హెచ్ఓడీల ముంద‌స్తు అనుమ‌తి లేకుండా ఉద్యోగుల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు చేప‌ట్ట‌రాదు.
  • ఉద్యోగులు మృతి చెందిన వారి కుటుంబభ్యుల‌కు వెంట‌నే కారుణ్య నియామ‌కాలు చేప‌ట్టాలి.
  • ఉద్యోగుల మెడిల్ రీయంబ‌ర్స్‌మెంట్ సీలింగ్ ప‌రిమితిని పెంచాలి.
  • ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇంటి స్థ‌లాల‌ను మంజూరు చేయాలి.
  • ఉద్యోగుల రిటైర్‌మెంట్ గ్రాట్యుటీని రూ.20 ల‌క్ష‌ల‌కు త‌క్కువ కాకుండా పెంచాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News