Donald Trump: ట్రంప్ నిర్ణయం.. భారత్ ఐటీపై ఎఫెక్ట్..

Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన దూకుడు కంటిన్యూ చేస్తున్నాడు. ముఖ్యంగా యూఎస్‌లో నివసిస్తున్న పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహారిస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయం పై భారత ఐటీపై ఎఫెక్ట్ పడనుందా ? అంటే ఔననే అంటున్నాయి భారత ఐటీ దిగ్గజ కంపెనీలు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 23, 2025, 11:06 AM IST
Donald Trump: ట్రంప్ నిర్ణయం.. భారత్ ఐటీపై ఎఫెక్ట్..

Donald Trump: తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్టుగా ఉంది భారత తో ట్రంప్ వ్యవహారం. భారత్ ను మొదటి నుంచి తన మొదటి మిత్రుడు అని చెబుతూనే మన దేశ పౌరుల పట్ల కఠినంగా వ్యవహరించే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ సందర్బంగా ఇప్పటికే పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక పన్ను విధిస్తున్నారు. దీంతో వలసలను తగ్గించొచ్చని అధ్యక్షుడు భావిస్తున్నారు.ట్రంప్‌ నిర్ణయాలపై భారత్‌ ఆచుతూచి వ్యవహరిస్తోంది. అమెరికాతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. ట్రంప్‌ పాలనకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులను తిరిగి మన దేశానికి  రప్పించేందుకు భారత్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే...ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఐటీ మీద కూడా పడనుంది. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా దేశానికే మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్థిక వృద్ధికి సాంకేతికత కీలకమని గుర్తు చేసింది. హెచ్‌1బీ వీసాలపై వెళ్లే సిబ్బంది చాలా తక్కువ వేతనాలకు పనిచేస్తారంటున్నారు. అమెరికాలో వేతనాలు తగ్గేందుకు కారణమవుతున్నారని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమేనని నాస్కామ్‌ తెలిపింది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా చర్యలు, ఆదేశాల వల్ల అమెరికాకు వెళ్లే భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు.

భారత ఐటీ పరిశ్రమ వృద్ధిపై ఎటువంటి అనుమానాలూ లేవన్నారు. అమెరికా ఆర్థిక వృద్ధికి భారత్, భారత నిపుణులు అత్యంత కీలకమని తెలిపారు. అమెరికా పరిణామాల వల్ల భారత ఐటీ పరిశ్రమపై ఎటువంటి నీలినీడలు కమ్ముకోవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హెచ్‌1బీ వీసా హోల్డర్లు తమ పిల్లల పౌరసత్వ విషయంలో ఎదుర్కోబోయే సవాళ్ల విషయంలో సానుభూతి వ్యక్తం చేశారు.

మన కంపెనీలు అమెరికాలోని స్థానికుల్లో నైపుణ్యం పెంపొందించేలా అక్కడ 1.1 బిలియన్‌ డాలర్ల  పెట్టుబడులు పెట్టాయన్నారు. ఈ పెట్టుబడులు 130కి పైగా యూనివర్సిటీలు, కళాశాలల్లో 29 లక్షల మంది విద్యార్థులపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు.అందుకే హెచ్‌1బీ వీసాల్లో 70% భారతీయులకే లభించడం మన నైపుణ్యాలకున్న గిరాకీని తెలియజేస్తోంది.

భారీ ఏఐ ప్రాజెక్టు స్టార్‌గేట్‌కు ట్రంప్‌ 2.0 ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్‌ ఏఐ, ఒరాకిల్‌ సంస్థల అధిపతులతో వైట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అమెరికాలో ఏఐను మరింత విస్తృతం చేయడానికి, లక్ష ఉద్యోగాలను సృష్టించడానికి.. అన్నిటి కంటే మించి చైనాకు మిన్నగా ఏఐ అభివృద్ధికి ట్రంప్‌ ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వచ్చే నాలుగేళ్లలో మొత్తం మీద 500 బిలియన్‌ డాలర్ల  మేర పెట్టుబడులు పెట్టాలన్నది ప్రణాళిక.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

మరోవైపు సరైన పత్రాలు లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. వాస్తవానికి ఆ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండొచ్చని అంచనా. తాజాగా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్లందరినీ వెనక్కి పిలిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.   దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించబోతోంద తెలిపారు. ట్రంప్ తాజా నిర్ణయంతో లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించనున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఇక ట్రంప్‌ చర్యల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News