అమరావతి: ఏపీలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో మొత్తం 58,052 కరోనా శాంపిల్స్‌కి ( COVID-19 tests ) పరీక్షించగా.. 7,998 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61 మంది కరోనావైరస్ కారణంగా మృతి చెందారు. జిల్లాల వారీగా మృతుల సంఖ్య వివరాలను పరిశీలిస్తే.. తూర్పు గోదావరిలో 14 మంది, గుంటూరులో ఏడుగురు, కర్నూలు జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్టణంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాల్లో ఒకరు మృతి చెందినట్టు ఏపీ సర్కారు తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 884 కు ( COVID-19 deaths ) చేరుకుంది. ( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 14,93,879 శాంపిల్స్‌ని పరీక్షించగా... మొత్తం 72,711 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 5,428 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మొత్తం 37,555 కి చేరింది. ( Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ? )