KCR VS MODI: రాజకీయ కార్యక్రమాల్లో ప్రధాని మోడీకి దూరంగా ఉండటం ఓకే కాని ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు హాజరుకావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని పదేపదే ఆరోపిస్తున్న కేసీఆర్.. ప్రధాని పర్యటనలో పాల్గొని తన అసమ్మతిని తెలుపవచ్చు కదా అనే టాక్ జనాల నుంచి వస్తోంది.
Bandi Sanjay to CM KCR : తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్... అదే నిజమైతే ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయన్నే నేరుగా కలిసి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
TRS MLAs Poaching Case Bail Plea: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫారంతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రోహిత్ రెడ్డి ఫిర్యాదులో వాస్తవం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు చెల్లదని స్పష్టంచేస్తూ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేయాలని చూసిన వ్యవహారంతో బీజేపీకి ఏ సంబంధం లేకపోతే ఈ కేసు విచారణ ఆపాలని కోరుతూ కోర్టుకు ఎందుకు వెళ్తోందని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ పార్టీ బండారం బయటపడుతుందేమోననే భయంతోనే కోర్టుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.
TRS MLAs Poaching Case: తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపే విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని డికే అరుణ ప్రకటించారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేదే తమ అనుమానం అని సందేహం వ్యక్తంచేశారు.
PM Modi Telangana tour: ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి మోదీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
TS High Court On TRS mlas Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Koppula Eeshwer: ప్రగతి భవన్ లో జరిగిన ఓ ఘటనతో కేసీఆర్ దళిత నేతను అవమానించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే బేరసారాలకు సంబంధించిప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్. ఈ సందర్భంగానే సీనియర్ నేత, దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఘోర అవమానం జరిగింది.
CM KCR On TRS MLAS Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోలు ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించిన నేపథ్యంలో ఏం జరుగుతోందనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Harish Rao Target BJP: చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి సభతో మునుగొడులో టీఆరెస్ గెలుపు ఖాయం అయిందన్నారు. బీజేపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు
KCR MUNUGODE MEETING: కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారన్నారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారని మండిపడ్డారు. వందల కోట్ల డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి.. ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీకి ఇంకా ఏం కావాలి.. మోదీ రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా.. ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే.. బీజేపీకి చేనేతల నుంచి ఒక్క ఓటు కూడా పోవద్దన్నారు. ప్రలోభాలకు ఆశపడితే గోసపడేది మనమేనని కేసీఆర్
Farm House Operation: ఆదివారం చండూరులో నిర్వహించిన బహిరంగ సభకు తనతో పాటు ఫాంహౌజ్ డీల్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. సభా వేదికపై ఆ నలుగురు ఎమ్మెల్యేలను జనాలకు పరిచయం చేస్తూ.. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టి పులి బడ్డలని కొనియాడారు.
CM KCR:తెలంగాణలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో దర్యాప్తు కోసం గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 51ను విడుదల చేసింది. ఆగస్ట్ 31నే తెలంగాణ హోం శాఖ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది.
CM Kcr: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.
TRS MLAS BRIBE: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల విచారణలో రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ కేసులో నందకుమార్ డొంక కదులుతోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నందకుమార్ కు సంబంధించి కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి
Cm KCR Silence: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్తో పాటు పార్టీ ముఖ్య నేతలు మౌనంగా ఉంటుండగా.. బీజేపీ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అధికార పార్టీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ అని అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ కట్టుకథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి స్పీచ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.