TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసు.. పోలీసులకు నో చెప్పిన ఏసీబీ కోర్టు..

TRS MLAs Poaching Case Bail Plea: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫారంతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రోహిత్ రెడ్డి ఫిర్యాదులో వాస్తవం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు చెల్లదని స్పష్టంచేస్తూ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.

Written by - Pavan | Last Updated : Nov 11, 2022, 07:13 PM IST
  • ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • నిందితుల బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా వేసిన కోర్టు
  • పోలీసుల పిటిషన్‌కి సైతం నో చెప్పిన ఏసీబీ కోర్టు
TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసు.. పోలీసులకు నో చెప్పిన ఏసీబీ కోర్టు..

TRS MLAs Poaching Case Bail Plea: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్ పై తీర్పును సోమవారానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.. ముగ్గురు నిందితులకు ఈ నెల 25 వరకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితులను మరికాసేపట్లో చంచల్ గూడా జైలుకు తరలించనున్నారు.

అంతకంటే ముందుగా నాంపల్లి ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన పిటిషనర్ తరుపు న్యాయవాది.. ఈ కేసు ఏసీబీ కోర్ట్ పరిధిలోకి రాదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి లంచం ఇవ్వడం కానీ లేదా ఆయన లంచం పుచ్చుకోవడం కానీ.. ఈ రెండింటిలో ఏదీ జరగలేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది.. ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి అసలు ఫిర్యాదు చేసే అర్హతే లేదని కోర్టుకు విన్నవించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫారంతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రోహిత్ రెడ్డి ఫిర్యాదులో వాస్తవం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన ఈ కేసు చెల్లదని స్పష్టంచేస్తూ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, పిటిషనర్ తరపు న్యాయవాది మాటలు విన్న కోర్టు.. బెయిల్ పిటిషన్‌పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

ఇదిలావుంటే, ఈ కేసులో ముగ్గురు నిందితులను విచారణ నిమిత్తం మరోసారి తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగిస్తే.. ఈ కేసులో మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉందని పోలీసులు కోర్టుని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా పడినందున.. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ని ఏసీబి కోర్టు తిరస్కరించినట్టు తెలుస్తోంది.

Also Read : TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సిట్ ఏర్పాటు.. స్టీఫెన్ రవీంద్ర ఎక్కడ ?

Also Read : TRS MLAs Poaching Case: కేసీఆర్ చెప్పిన అది నిజమే అయితే.. ఇదీ నిజమే.. డికె అరుణ సవాల్

Also ReadTRS MLAs Poaching Case: ఇందులో గవర్నర్‌కి ఏం సంబంధం.. బీజేపి నేతలకు మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News