YSRCP Plenary 2022: వైఎస్‌ఆసీపీ(YSRCP) పార్టీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. 8,9 తేదీల్లో జరిగే ప్లీనరీని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Jagananna Vidya kanuka: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోగన్ రెడ్డి మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించారు. రెండు నెలల్లో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు అందిస్తామని తెలిపారు. 8వ తరగతి నుంచి ఆ పై తరగతుల విద్యార్థులకు సెప్టెంబర్ లో ల్యాప్ ట్యాప్ లు పంపిణి చేస్తామని తెలిపారు
CM JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో పర్యటించారు. చెన్నే కొత్తపల్లిలో పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్... విపక్షాలపై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
KCR NEW PARTY: జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల నేతలు కూడా కేసీఆర్ రాజకీయ ప్రకటనపై ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా కేసీఆర్ జాతీయ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు.
PRESIDENT ELECTION 2022: భారతదేశ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 15 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నిక అనివార్యమైతే జూలై 18న పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
President Election: భారత రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. జూలై 18న దేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రెసిడెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో బలాలపై చర్చ సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్లెన్ని.. ఏ పార్టీకి ఎంత బలం ఉంది.. ఎన్డీఏకు మెజార్టీ ఉందా.. విపక్షాలు బరిలో ఉంటాయా అన్న చర్చలు సాగుతున్నాయి
CM JAGAN : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజు బిజీబిజీగా గడుపుతున్నారు సీఎం జగన్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.
Cm Jagan Delhi Tour: నేడు దేశరాజధాని ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4.౩౦ గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.
CM Jagan Davos:గతంలో చంద్రబాబు దావోస్ లో తెగ హడావుడి చేసేవారు. దావోస్ సదస్సుకు ప్రతి ఏటా హాజరయ్యేవారు చంద్రబాబు. కీలక సమావేశాల్లో పాల్గొనేవారు. దావోస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవారు.తొలిసారి జగన్ వెళ్లడంతో.. గతంలో చంద్రబాబు పర్యటనతో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి
Ap Cm Jagan:2024 ఎన్నికలపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 27న మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లు, ఆ పార్టీ అన్ని విభాగాలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. పార్టీ పటిష్ఠతపై గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ టూర్లో జనసేన శ్రేణుల జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు.
AP CM convoy Issue: ఆంధ్రప్రదేశ్ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఈనెల 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించనున్నారు. అయితే జగన్ పర్యటన కోసం ఒంగోలు పోలీసులు ఓవరాక్షన్ చేశారు.
Acharya Pre-Release: ఆచార్య చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయింది. వచ్చే వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు టాక్. ఈ ఈవెంట్‌కు ఏపీ సీఎం జగన్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు సమాచారం.
AP Ministers Resign: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేశారు. సీఎం జగన్ అధ్యక్షతన సెక్రెటరియేట్లో జరిగిన మంత్రివర్గ భేటి అనంతరం.. మంత్రులంతా తమ రాజీనామాలు సీఎంకు సమర్పించారు.
Huzurnagar Election: ఏపీ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో ఎన్నికల నియామావళిని ఉల్లఘించిన కారణంగా గతంలో జగన్ పై ఓ కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారించిన హైకోర్టు ఏప్రిల్ 26 వరకు స్టే ఇచ్చింది.
AP Cabinet: ఏపీ కేబినెట్లో త్వరలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ విషయంపై సీఎం జగన్ స్వయంగా కేబినెట్‌తో చర్చించారని సమాచారం. కొంత మందికి ఇదే చివరి సమావేశమనే సంకేతాలు కూడా ఇచ్చారట.
AP Elections: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.
AP CRDA: ఏపీ మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కారుకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. అమరావతి రాజధానిగా.. మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
AP Cinema Ticket Issue: ఏపీలో సినిమా టికెట్ రేట్ల వ్యవహరం నేడు ఓ కొలిక్కి వచ్చేట్లు కనిపిస్తుంది. ఇదే విషయమై నేడు సినిమా టికెట్ల కమిటీ సెక్రటేరియట్ లో సమావేశం కానుంది. థియేటర్లలో ప్రీమియం, ఎకానమీ క్లాసులను ప్రవేశపెట్టి టికెట్ రేట్లను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.