AP Corona: ఏపీలో తగ్గుతున్న కొవిడ్ తీవ్రత- నైట్​ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం

AP Corona: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నైట్​ కర్ఫ్యూ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2022, 07:54 PM IST
  • ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
  • నైట్​ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం
  • తాజా నిబంధనలపై సీఎం ప్రకటన
AP Corona: ఏపీలో తగ్గుతున్న కొవిడ్ తీవ్రత- నైట్​ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం

AP Corona: కరోనా కఠిన నిబంధనలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట కార్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్​.. నైట్​ కర్ఫ్యూ నిబంధన ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఇలా..

ఏపీలో తాజాగా 434 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం 9 గంటల వరకు ఈ కేసులు నమోదయ్యాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారు

ఇదే సమయంలో 4,636 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 14,726 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,90,83,148 మంది రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నారు. 39,04,927 మందికి ఒక డోసు వ్యాక్సిన్​ ఇచ్చారు వైద్య సిబ్బంది.

కొత్త నిబంధనలు ఇవే..

కరోనా కేసులు తగ్గుతున్నా, నైట్​ కర్ఫ్యూ ఎత్తేసినా.. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాపార సముదాయాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ఇక రాష్ట్రంలో ఫీవర్​ సర్వే కొనసాగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. లక్షణాలు ఉంటే టెస్టులు తప్పనిసరిగా చేయాలని కూడా అధికారులకు సూచించింది.

వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు..

గిరిజన ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు ప్రోత్సాహకాలకు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్పెషలిస్టులకు 50 శాతం, వైద్యులకు 30 శాతం చొప్పున ప్రోత్సహాకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న కసరత్తును సీఎం జగన్​ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also read: Govindananda Saraswati: 'TTD దైవ‌ద్రోహం చేస్తోంది'.. గోవిందానంద సరస్వతి షాకింగ్ కామెంట్స్

Also read: Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News