CM JAGAN : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజు బిజీబిజీగా గడుపుతున్నారు సీఎం జగన్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. జాతీయ ఆహార భద్రతా చట్టంలో సవరణలు కోరుతున్నారు జగన్. లబ్దిదారుల ఎంపికలో కొన్ని సవరణలు కోరుతున్నారు. దీనిపై అమిత్ షాకు నివేదిక ఇచ్చారు. రెవిన్యూ లోటు భర్తీ , పోలవరం నిధులపై చర్చించారు. కొత్త మెడికల్ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారని తెలుస్తోంది.
ఏపీ పెండింగ్ సమస్యలపైనే కేంద్ర హోంశాఖ మంత్రితో జగన్ చర్చించారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరిగిందని అంటున్నారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం. దీనిపై ఇద్దరు నేతలు చర్చించారని అంటున్నారు. ఏపీ రాజకీయ అంశాలపైనా అమిత్ షా, జగన్ మధ్య చర్చ జరిగిందని సమాచారం. ఏపీలో కొన్నిరోజులుగా పొత్తులపై చర్చ సాగుతోంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఏపీ బీజేపీ నేతలు క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాతో జగన్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఏపీ సమస్యలపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు నిధులపై ప్రధానితో సీఎం జగన్ మాట్లాడారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. తర్వాత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు జగన్. రాత్రి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ షేకావత్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ బిల్లులను త్వరగా క్లియర్ చేయాలని కోరారు.
READ ALSO: India Covid-19: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు... మెుత్తం కేసులు ఎన్నంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook