AP CRDA: జగన్ సర్కారుకు హై కోర్టులో షాక్​- సీఆర్​డీఏ పక్కాగా అమలు చేయాల్సిందే!

AP CRDA: ఏపీ మూడు రాజధానుల విషయంలో జగన్​ సర్కారుకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. అమరావతి రాజధానిగా.. మాస్టర్ ప్లాన్​ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 12:50 PM IST
  • మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వానికి షాక్​
  • సీఆర్​డీఐ అమలు చేయాలన్న హైకోర్టు
  • రైతులకు న్యాయం చేయాలని ఆదేశాలు!
AP CRDA: జగన్ సర్కారుకు హై కోర్టులో షాక్​- సీఆర్​డీఏ పక్కాగా అమలు చేయాల్సిందే!

AP CRDA: జగన్ సర్కారుకు ఏపీ హై కోర్టులో చుక్కెదురైంది. అంధ్ర ప్రదేశ్​ క్యాపిటల్ రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ (ఏపీ సీఆర్​డీఏ) ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఈ మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ప్రశాంత్​కుమార్​ మిశ్ర నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసం గురువారం తీర్పు వెలువరించింది.

మూడు రాజధానుల అంశం, సీఆర్​డీఏ రద్దు పిటిషన్​పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు నేడు (గురువారం) తీర్పు వెలువరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు రాజధానులపై జగన్​ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది ధర్మాసనం. సీఆర్​డీఏలో ఉన్న హామీలను పక్కాగా నెరవేర్చరాలని కూడా వివరించింది.

ఆరు నెలల్లో సీఆర్​డీఏ మాస్టర్​ ప్లాన్​ను అమలు చేయాలని సూచించింది కోర్టు. రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

అమరావతి భూములను రాజధాని అభివృద్ధి కోసం మాత్రమే వాడాలని కూడా న్యాయస్థానం వెల్లడించింది. వాటిని ఇతర అవసరాలకోసం వినియోగించడం లేదా తనఖా పెట్టడం చేయొద్దని ఆదేశించింది. రాజధాని విషయంపై దాఖలైన 70 పిటిషన్లపై విచారణ చేపట్టి తీర్పునిచ్చిన హై కోర్టు.. ఆయా పిటిషన్ల ఖర్చు కింద రూ.50 చెల్లించాలని వివరించింది.

Also read: AP Rain Forecast: ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!

Also read: Summer Temperature: ఈ వేసవిలో తీవ్రంగా ఉండనున్న ఎండలు, వడగాల్పులతో అప్రమత్తం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News