AP CM Jagan Meeting: ఈనెల 27న వైసీపీ నేతలతో సీఎం జగన్‌ కీలక సమావేశం

Ap Cm Jagan:2024 ఎన్నికలపై సీఎం జగన్‌ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 27న మంత్రులు,  రీజినల్‌ కోఆర్డినేటర్లు, ఆ పార్టీ అన్ని విభాగాలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. పార్టీ పటిష్ఠతపై గ్రౌండ్‌ లెవెల్‌లో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 11:36 AM IST
  • ఈనెల 27న వైసీపీ నేతలతో సీఎం జగన్‌ కీలక సమావేశం
  • పార్టీ బలోపేతంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్
  • సమావేశానికి హాజరుకానున్న మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లు
AP CM Jagan Meeting: ఈనెల 27న వైసీపీ నేతలతో సీఎం జగన్‌ కీలక సమావేశం

Ap Cm Jagan Meeting with YSRCP Leaders: 2024లో జరగబోయే ఎన్నికలపై వైసీపీ అధినేత సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఫోకస్‌ పెట్టారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు..పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియామకమైన మాజీ మంత్రులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు. ఈనెల 27న సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లకు పార్టీ పటిష్ఠతపై గ్రౌండ్‌ లెవెల్‌లో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో పలువురు నేతల అసంతృప్తిపై చర్చించున్నట్టు తెలుస్తోంది. పలు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఉన్న నేపథ్యంలో..సఖ్యతగా ఉంచడం పార్టీ బలోపేతంపై కీలక చర్చించున్నట్టు తెలుస్తోంది.

సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టాక ఆ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం తీప్పికొట్టాలని ఆ పార్టీ నేతలకు సూచించనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలని నేతలకు చెప్పనున్నట్టు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఎలక్షన్‌ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో..వైసీపీకి మాత్రం తన ఎన్నికల వ్యూహాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీతో కాంగ్రెస్‌ పొత్తు ఉంటుందని ప్రచారం జోరందుకుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీతో తమ పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం తమకు వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండవని ఆ పార్టీ కీలక ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటనలకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 10 రోజుల్లోనే ఒంగోలు, తూర్పు గోదావరి, కడప, కర్నూలు జిల్లాల్లో వరుస పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు. వరుసగా జిల్లాల పర్యటనలు చేపట్టి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సీఎం వైఎస్ నేరుగా కౌంటర్‌ ఎటాక్‌ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జిల్లాల పర్యటనలో టీడీపీ, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్నా రచ్చబండ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టి పథకాల అమలు తీరును నేరుగా ప్రజలతో మమేకమై తెలుసుకోనున్నారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీఎం వైఎస్ జిల్లా పర్యటనల కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ బుల్లెట్‌ బస్సులను సిద్ధం చేసింది. జిల్లాల పర్యటనల్లో భాగంగా పార్టీ నేతల అంతర్గత విభేదాలపై దృష్టి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు, నాడు-నేడు పనుల పురోగతిపై సీఎం వైఎస్‌ దృష్టి సారించారు. నాడు-నేడులో పాఠశాల్లో అందుతున్న సదుపాయాలను పరిశీలించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా సీఎం జగన్‌ ఆరా తీయనున్నారని ఆ పార్టీలు వెల్లడించాయి. 

Also Read: PK KCR Meeting: సీఎం కేసీఆర్‌కు పీకే కీలక సూచన... వచ్చే ఎన్నికల్లో ఆ సిట్టింగ్‌లను మార్చాల్సిందే..!

Also Read: KTR Comments‌: కేటీఆర్ సంచలన కామెంట్స్‌..ఎంఐఎంతోనే మాకు పోటీ.. బీజేపీకి సింగిల్ డిజిటే.!

Also Read: Rashmika Vijay: రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ ప్రపోజల్.. నేషనల్ క్రష్ ఒకే చెప్పేసిందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News