Penna River Bridge: ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నా నది వంతెన కుంగిపోయింది. నది ప్రవాహం ఉధృతికి.. వంతెన మధ్య భాగం ఒంగిపోయింది. దీంతో వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు.
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి సర్వదర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున విడుదల చేయగా.. అవి 10 నిమిషాల్లో వెబ్సైట్లో దర్శన టికెట్లు ఖాళీ అయ్యాయి. అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Food Poisoning In School: విశాఖ మన్యం పాడేరు కేజీబీవీ పాఠశాలలో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. సిబ్బంది హుటాహుటిన బాధితులను పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ చంద్రకళ తెలిపారు.
Andhra Pradesh 3 Capital: మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోనున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ కాసేపట్లో అత్యవసరంగా భేటీ కానుంది.
Trains Cancelled Today: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అనేక రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.
AP Governor Corona: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నెగెటివ్ గా తేలినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
Madanapalle Tomato Price: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక ధర పలికింది. వరుస వర్షాలతో పంట దెబ్బతిని ఉత్పత్తి తగ్గడం వల్ల మంగళవారం కిలో టమాటా రూ.100కు విక్రయించారు. 28 కిలోల కేట్ ధర గరిష్ఠంగా రూ.2,800 పలకడం విశేషం.
APSRTC News Today: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగుసేవల్లోని కార్మికులు, భద్రతా సిబ్బంది జీతాలను పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
Drown in Krishna River: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద విషాదం చోటు చేసుకుంది. కార్తిక సోమవారం సందర్భంగా కృష్ణా నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
AP Local Body Elections: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని స్థానిక సంస్ధలకు నేడు (నవంబరు 15) ఎన్నికలు జరుగుతున్నాయి. 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నిర్వహిస్తున్న ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్ సహా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నిక జరుగుతుండడం వల్ల.. అందరిలో ఆసక్తి నెలకొంది.
Earthquake In Vizag: విశాఖపట్నంలో స్వల్పంగా భూమి కంపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Gold Smuggling News: రైల్లో అక్రమంగా బంగారాన్ని (Gold Smuggling) తరలిస్తున్న ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు విశాఖపట్నంలో పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు 2 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం (Gold Seized) చేసుకున్నారు.
MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లోని ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రణాళిక సిద్ధమైంది. తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్ లోని 3 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Jagga Reddy About KCR: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే... తానూ మద్దతిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలోనూ సమైక్యవాదాన్నే వినిపించినట్టు గుర్తు చేశారు. సమైక్యం.. తమ వ్యక్తిగత అభిప్రాయమేనని.. పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Grama Ward Sachivalayam: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. అక్టోబరు నెలకు సంబంధించిన జీతాల్లో కొందరికి 10 శాతం.. మరికొందరికి 50 శాతం కోత విధించనట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. బయోమెట్రిక్ యంత్రం సరిగా పనిచేయక పోవడంతో తక్కువ హాజరు నమోదవ్వడమే అందుకు కారణమని తెలుస్తోంది.
కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని... నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కడప జిల్లాలోని సిద్ధవటంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్నా నదిలో సరదాగా స్నానం చేయడానికి వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు.
కరోనా మెడిసిన్ (CoronaVirus Medicine) ‘రెమ్‌డెసివర్’ (Remdesivir Injection) మార్కెట్లోకి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు.
ఏపీలో కోవిడ్19 టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Home Quarantine in AP) కీలక నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.