ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు రద్దుకు నిర్ణయం

Andhra Pradesh 3 Capital: మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోనున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్‌ కాసేపట్లో అత్యవసరంగా భేటీ కానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 12:23 PM IST
    • మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గిన ఏపీ గవర్నమెంట్
    • రాజధానుల బిల్లును వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైన జగన్ సర్కారు
    • హైకోర్టుకు విన్నవించుకున్న అడ్వకేట్ జనరల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు రద్దుకు నిర్ణయం

Andhra Pradesh 3 Capital: రైతుల ఉద్యమ ధాటికి ప్రభుత్వాలు దిగిరాక తప్పడం లేదు. అటు ఢిల్లీలో రైతుల ఉద్యమాల నేపథ్యంలో సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోగా.. ఇప్పుడు అమరావతి రైతుల ర్యాలీ ధాటికి మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకునేందుకు జగన్ సర్కారు నిర్ణయించుకుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసినట్లు అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన వివరాలను నివేదించారు. మరోవైపు సీఎం జగన్‌ కాసేపట్లో ఏపీ  అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్‌ కాసేపట్లో అత్యవసరంగా భేటీ కానుంది. వరదల కారణంగా ఇవాళ్టితోనే శాసన సభ సమావేశాలను ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్లో నిర్ణయం అనంతరం సమావేశాలను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడు రాజధానుల చట్టం విషయంలోనూ కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వరద బాధితులకు రూ.2 వేలు చొప్పున సాయం అందించే అంశం.. సౌర విద్యుత్‌ కొనుగోలు అంశాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఇవాళ అసెంబ్లీ సమావేశాలు (మూడో రోజు) 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన కారణంగా పలు ప్రశ్నలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.  

Also Read: ఏపీ వరద భీభత్సం మిగిల్చిన దృశ్యాలు, ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ వ్యూ

Also Read: ఏపీ అసెంబ్లీ ఘటన దురదృష్టకరం: సోనూసూద్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News