APSRTC News Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని ఒప్పంద, పొరుగుసేవల్లో కార్మికులు, భద్రతా సిబ్బంది జీతాలను పెంచుతూ యాజమాన్యం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. నెలకు నైపుణ్యం లేని కార్మికులకు రూ.294, కొంత నైపుణ్యం ఉన్నవారికి రూ.349, నైపుణ్య కార్మికులకు రూ.428, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.322, అటెండర్లకు రూ.294, భద్రతా సిబ్బందికి రూ.304 చొప్పున పెంచారు. ఈ పెంపు అక్టోబరు నెల నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు గతంలో పెంచిన జీతాలే ఇవ్వడంలేదని, వాటిని గుత్తేదారులు జేబుల్లో వేసుకుంటున్నారని ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read: Anantapur robbery : అనంతపురం జిల్లా కదిరిలో దొంగల బీభత్సం.. ఉపాధ్యాయురాలి హత్య
Also Read: Supreme Court: ఆలయ వ్యవహారాలు సుప్రీంకోర్టు పరిధిలో రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook