కరోనా వైరస్ వ్యాప్తికి నియంత్రణ చర్యలు తీసుకుంటూనే మహమ్మారిని అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మెడిసిన్ (CoronaVirus Medicine) ‘రెమ్‌డెసివర్’ (Remdesivir Injection) మార్కెట్లోకి వచ్చింది. అయితే అవసరం ఉన్న కరోనా పేషెంట్లకు ఈ మెడిసిన్ లభించడానికి కేవలం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో రెమ్‌డెసివర్ విక్రయిస్తున్నట్లు హెటిరో (Hetero) సంస్థ ఎండీ పార్థసారధి రెడ్డి తెలిపారు. కోవిడ్19 (COVID19) పేషెంట్ల కోసం మాత్రమే ఈ మెడిసిన్ విక్రయిస్తారు. Telangana: కొత్తగా 1,593 కరోనా కేసులు..
హైదరాబాద్ హెటిరో కార్యాలయం
ఇం.నెం: 8-3-166/1&2, ఫస్ట్ ఫ్లోర్ చల్లా ఎస్టేట్, 18, సుల్తాన్ బాగ్, ఎర్రగడ్డ మూసాపేట.
హైదరాబాద్, తెలంగాణ - 500082
ఫోన్ నెం: 040 -23707171
విజయవాడ హెటిరో కార్యాలయం
ఇం. నెం: 26-3-126, రెండో అంతస్తు, నాగేశ్వరరావు పంతులు రోడ్డు, గాంధీనగర్
విజయవాడ, కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్ - 520003
ఫోన్ నెం: 0866-6615811
రెమ్‌డెసివర్ కొనేందుకు సమర్పించాల్సిన పత్రాలు:
- కోవిడ్19 పాజిటివ్ పేషెంట్ అని టెస్టు రిపోర్ట్ జిరాక్స్
- కరోనా పేషెంట్ ఆధార్ కార్డు కలర్ జిరాక్స్
- హాస్పిటల్ అడ్మిట్ కార్డు (ఒరిజినల్). ఇన్ పేషెంట్ నెంబర్ తప్పనిసరి
- ఆ కేంద్రాల్లో ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే విక్రయాలు
- ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ డెబిట్ కార్డులతో చెల్లింపులు కుదరదు. నగదు క్యాష్ మాత్రమే చెల్లించాలి. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..