Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. స్టాక్ ఫైల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదెలాగంటే..
అలోపతిక్ మెడిసిన్‌పై యోగా గురు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ బ్రాంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాకుండా రాందేవ్‌పై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ (IMA Uttarakhand slaps defamation notice on Ramdev) నోటీసులు కూడా పంపించింది
Remdesivir Injection : కరోనా పేషెంట్లపై రెమిడెసివర్ ప్రభావం చూపుతున్నట్లుగా కనిపించడం లేదని, త్వరలో కోవిడ్19 చికిత్సలో భాగంగా ఈ ఇంజక్షన్‌ను తొలగించనున్నారని గంగా రామ్ ఆసుపత్రి చైర్పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా అభిప్రాయపడ్డారు.
వలస కూలీలు, దినసరి కార్మికులను లాక్డౌన్ సందర్భంగా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు, బస్సు, విమాన టికెట్లు అందించి గొప్ప సాయాన్ని అందించాడు. తాజాగా కరోనా సెకండ్ వేవ్‌లో టీమిండియా క్రికెటర్లకు సైతం సోనూసూద్ సాయం చేసి కష్టకాలంలో ఆదుకుంటున్నాడు.
Remdesivir Demand: కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏపీలోని విశాఖనగరం రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డాగా మారింది. అటు ముంబైలో కూడా భారీగా రెమ్‌డెసివిర్ వయల్స్ పట్టుబడ్డాయి.
COVID-19 cases in Delhi: ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ సంక్షోభంలో చిక్కుకుంటోంది. స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాటల్లోనే ఈ విషయం స్పష్టమవుతోంది. ఓవైపు ఢిల్లీలో 24 గంటల్లో దాదాపు 24 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తోంటే.. మరోవైపు ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ (Oxygen shortage), లైఫ్ సేవింగ్ డ్రగ్‌గా పేరున్న యాంటి వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ వ్యాక్సిన్, ఐసీయూ బెడ్స్‌కి తీవ్రమైన కొరత ఏర్పడుతోంది.
కరోనా మెడిసిన్ (CoronaVirus Medicine) ‘రెమ్‌డెసివర్’ (Remdesivir Injection) మార్కెట్లోకి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు.
COVID-19 medicine: న్యూ ఢిల్లీ: కొవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న రెమిడిసివిర్, టొసిలిజుమాబ్, ఫెవిపిరవిర్ వంటి ఔషధాలను మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదని ఢిల్లీ సర్కార్ ( Delhi govt ) స్పష్టంచేసింది. ఈ మేరకు ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ విభాగం డ్రగ్స్ కంట్రోలర్స్కి ఆదేశాలు జారీచేసింది.
కరోనా వైరస్ ( Corona virus ) ఓ వైపు విజృంభిస్తుంటే మరోవైపు ముఖ్యమైన ఔషధంగా భావిస్తోన్న రెమిడెసివిర్ ధర ఆకాశాన్నంటుతోంది. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈ మందు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
కోవిడ్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోంది. అన్ని దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతోపాటు చాలా దేశాల్లో వివిధ రకాల మందుల్ని ఈ వైరస్ పై ప్రయోగిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు ఎలా ఉన్నాయనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. మరో రెండు వారాల్లోనే ఔషధాల ప్రయోగ ఫలితాలు రానున్నట్టు డబ్యూహెచ్ వో స్పష్టం చేయడమే దీనికి కారణం.
Dexamethasone to treat COVID-19: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిశోధనలు సత్ఫలితాలనిస్తూ... ఒక్కొక్కటిగా అందుబాటులో ఉన్న మందులకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నాయి. మొన్న ఫావిపిరవిర్( Favipiravir ), నిన్న రెమిడెసివర్( Remdesivir ).. ఇక ఇప్పుడు డెక్సో మెధసోన్( Dexamethasone ) ఆ జాబితాలోకి వచ్చి చేరింది.
Covifor Injection | కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు హెటిరో సంస్థ రెమ్డెసివర్తో కలిపి తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కోవిఫర్ మార్కెట్లోకి వచ్చేసింది. కోవిఫర్‌ను మార్కెట్లొకి పంపిణీ ప్రారంభించినట్లు హెటిరో సంస్థ బుధవారం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.