'కరోనా వైరస్'.. మృత్యుక్రీడ ఆడుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ఆర్ధిక వ్యవస్థ కుంటుపడుతున్న క్రమంలో ఈ నెల 20 నుంచి కొన్ని రంగాలకు పాక్షిక సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగభగ మండుతున్నాడు. మధ్యాహ్నం పూట ఇంటి నుంచి జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్న వారిని ఉక్కపోత చంపేస్తోంది.
కరోనా కేసులను ఎంత డీల్ చేస్తున్నా పెరుగుతున్న క్రమంలో తెలంగాణలో మరో ట్విస్ట్ Deoband Dargah వెలుగుచూసింది. ఢిల్లీ మర్కజ్‌తో పాటు మరో దర్గాకు వెళ్లివచ్చిన వారికి కరోనా పాజిటివ్ రావడం తెలంగాణలో హల్చల్ చేస్తోంది.
మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. జవహర్ నగర్లో ఇద్దరు యువతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. స్థానికంగా సంచలనం కలిగిస్తున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ కేసుల సంఖ్య 404కు పెరిగింది.
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కాల్చిపారేయాలన్నారు.
'కరోనా వైరస్' తెలంగాణను బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న వైరస్ బాధితుల సంఖ్య గుబులు పుట్టిస్తోంది. దీంతో కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో మద్యం దుకాణాలు మూత పడటంతో కొందరు జనాలు పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కరోనా కంటే మందుబాబుల సమస్యలే ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నాయి.
డ్రోన్‌తో ఫామ్ హౌస్ ఫోటోలు తీశారన్న అభియోగాలతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 14 రోజుల రిమాండుకు తరలించారు. తాజాగా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణలో మరో మహిళపై అఘాయిత్యం. దిశ ఘటన మరువక ముందే మరో మహిళపై అత్యాచారం..!! పోలీసులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా. . ఎన్ని కొత్త చట్టాలు చేసినా. . అత్యాచారాలపర్వం ఆగడం లేదు. దిశ తరహాలోనే మరో మహిళపై అత్యాచారం, హత్య చేయడం ఇప్పుడు మళ్లీ కలవరపెడుతోంది.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెర్ర చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
ఇప్పటికే ప్రపంచ దేశాలను గడగడా వణికిస్తున్న 'కరోనా వైరస్'... భారత దేశంలోనూ విజృంభిస్తోంది. అందులోనూ తెలంగాణలోనే ఇప్పటి వరకు రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో వ్యక్తికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 3కు పెరిగింది.
హైదరాబాద్ లోని ఇంటర్మీడియెట్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీ ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. Go నంబర్ 35ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టారు.
తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా దసరా పండుగను పురస్కరించుకుని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందిస్తుందని తెలిసిందే. ఈ ఏడాది రూ.317 కోట్ల విలువ చేసే బతుకమ్మ చీరలకు ఆర్డరిచ్చింది.
తాను కొన్న భూమికి పట్టా చేయాలన్న దరఖాస్తు నాలుగేళ్లుగా అలాగే ఉండటంతో అధికారిని కలిశాడు ఆ రైతు. రూ.13 లక్షలు డిమాండ్ చేయగా, రూ.10 లక్షలు ఇచ్చుకుంటానని డీల్ కుదుర్చుకుని ఏసీబీకి పట్టించాడు.
ఒక్కోసారి మనం చేసే చిన్న నిర్లక్ష్యమే యమపావమై ప్రాణాల్ని బలితీసుకుంటుంది. బైకు మీద వెళ్తున్న ఓ వివాహిత చీర కొంగు సరిచేసుకోకపోవడంతో చక్రంలో ఇరుక్కుని రోడ్డు మీద పడిపోయి చనిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.