హైదరాబాద్: ఎంపీ, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. 14 రోజులపాటు చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. అనుమతి లేకుండా, అక్రమంగా డ్రోన్ వినియోగించిన కేసులో రేవంత్ రెడ్డిన నార్సింగి పోలీసులు కొన్ని రోజుల కిందట అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Also Read: శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
డ్రోన్ కేసులో బెయిల్ కోసం రేవంత్ దాఖలు చేసుకోగా ప్రయోజనం లేకపోయింది. తొలుత ఈ పిటిషన్ విచారించిన కూకట్పల్లి కోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది. బెయిల్ కోసం కాంగ్రెస్ ఎంపీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టిపారేశారు. దీంతో రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును రేవంత్ ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ విచారించిన అనంతరం రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువడింది. తమ అభిమాన నేతకు బెయిల్ మంజూరు కావడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
See Pics: బుల్లితెర భామ టాప్ Bikini Photos
కాగా, ఇటీవల జన్వాడలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి తన అనుచరులతో ధర్నాకు దిగారు. ఈ క్రమంలో డ్రోన్‌తో ఫామ్ హౌస్ ఫోటోలు తీశారన్న అభియోగాలతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 14 రోజుల రిమాండుకు తరలించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.