ఇంటర్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ లోని ఇంటర్మీడియెట్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీ ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. Go నంబర్ 35ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టారు.

Last Updated : Mar 3, 2020, 12:07 PM IST
ఇంటర్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ లోని ఇంటర్మీడియెట్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీ ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. Go నంబర్ 35ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టారు.

ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా ఏబీవీపీ నాయకులు పోరాటం చేస్తున్నారు. ఐతే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో .. ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియెట్ బోర్డ్ కార్యాలయాన్ని ఏబీవీపి విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఏబీవీపీ విద్యార్థులు గేటు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఐతే వారిని అడ్డుకున్న పోలీసులు.. గేటు బయట నుంచి లాగిపడేశారు.

Read Also: 'కరోనా వైరస్'కు మందు ఇదేనంటున్న బీజేపీ ఎమ్మెల్యే

ఎయిడెడ్ కళాశాలల భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఎయిడెడ్ కళాశాలల్లో టీచింగ్, నాన్- టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News