భువనగిరి: యాదాద్రి భువనగిరిలో విషాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం భర్తతో కలిసి సొంతూరుకి వెళ్తున్న మహిళ మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. బైకు మీద వెళ్లేటప్పుడు తీసుకొని ఓ చిన్న జాగ్రత్తనే ఆమె ప్రాణాలు బలితీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా పొడుచేడు గ్రామానికి చెందిన పిట్టల సైదులు ముదిరాజ్ కుటుంబం జీవనోపాధి కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చింది.
Also Read: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం
ఈ క్రమంలో సోమవారం తమ సొంత గ్రామంలో పని ఉందని భార్య దుర్గను తన బైకు మీద ఎక్కించుకుని బయలుదేరాడు. ప్రమాదవశాత్తూ దుర్గ కట్టుకున్న చీర కొంగు బైకు చక్రంలోకి వెళ్లి ఇరుక్కుపోయింది. ఆత్మకూరు (ఎం)లో ఓ ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే అమాంతం రోడ్డుపై పడిపోయింది దుర్గ. చీర కొంగు బైక్ చక్రంలో ఇరుక్కుపోవడంతో రోడ్డుపై పడిపోయిన దుర్గ తలకు బలమైన గాయాలయ్యాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి
108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేదని చూస్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆ మహిళ ప్రాణాలు కాపాడాలని చూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స కోసం పెట్రోలింగ్ వాహనంలో తరలిస్తుండగానే మార్గం మధ్యలోనే దుర్గ చనిపోయింది. దీంతో పొడుచేడులో విషాదఛాయలు అలుముకున్నాయి. మరికొన్ని గంటల్లో చూస్తామనుకున్న దుర్గ మరణవార్త విన్న కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
బైక్ చక్రంలో చీర కొంగు ఇరుక్కుని!