225 డిజైన్లతో కోటి బతుకమ్మ చీరలు.. సిరిసిల్ల నేతన్నలకు పండగే!

తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా దసరా పండుగను పురస్కరించుకుని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందిస్తుందని తెలిసిందే. ఈ ఏడాది రూ.317 కోట్ల విలువ చేసే బతుకమ్మ చీరలకు ఆర్డరిచ్చింది.

Last Updated : Feb 28, 2020, 01:40 PM IST
225 డిజైన్లతో కోటి బతుకమ్మ చీరలు.. సిరిసిల్ల నేతన్నలకు పండగే!

హైదరాబాద్: తెలంగాణలో దసరా అనగానే గుర్తొచ్చేది ప్రతిష్టాత్మక బతుకమ్మ పండుగ. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలోకి రావడంతో ఆచారాలు, పద్ధతులకు మళ్లీ పునరుజ్జీవనం వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు మురిసేలా చేయించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బతుకమ్మ చీరలపై టీఆర్ఎస్ తీపి కబురు అందించింది. 225 డిజైన్లతో కోటి బతుకమ్మ చీరల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డరిచ్చింది. దీంతో మన చేనేతన్నలకు చేతినిండా పని దొరకనుంది.

రూ.317 కోట్ల విలువ చేసే బతుకమ్మ చీరలకు టీఆర్ఎస్ సర్కార్ సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ ఇచ్చినట్లు టీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించారు. 18 వేల మగ్గాలపై పనిచేసే 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించనుండటం ఆనందదాయకం. నేతన్నలకు చేతి నిండా పని, వారి శ్రమకు తగిన వేతనం లభిస్తుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ బతుకమ్మ చీరలపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో చీరకు రూ.287 రూపాయల ఖర్చు చేయనున్నారు.

Also Read: వామ్మో .. మార్చిలో బ్యాంకులకు అన్ని సెలవు దినాలా?

కాగా, బతుకమ్మ చీరల ఆర్డర్‌తో ఒక్కో చేనేతన్నకు సగటున రూ.20 వేలు సంపాదించుకుంటారని సర్కార్ భావిస్తోంది. మొదట్లో 30 డిజైన్ల చీరలతో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ ఈ  ఏడాది ఏకంగా 225 డిజైన్లకు చేరుకుంది. ఆరు నెలల లక్ష్యంతో సిరిసిల్ల నేతలకు తెలంగాణ సర్కార్ కోటి బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ చివరికల్లా చీరలు తయారు కాగా, పండుగకు కొన్ని రోజుల ముందు కోటిమంది ఆడబిడ్డలకు చీరల్ని అందజేయనున్నారు.

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ

Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News