తెలంగాణ ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తోంది. అందు కోసం నోటిఫికేషన్లను జారీ చేసింది. దాదాపు 18,428 ఉద్యోగాల నియామకం చేపట్టే అవకాశం ఉందనేది సమాచారం.
రంజాన్ సందర్భంగా ప్రతీ షాపుకి వెళ్లి డబ్బులు అడుక్కోవడం కోసం మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్‌కి వచ్చిన పలువురు ట్రాన్స్జెండర్లను కిడ్నాపర్లుగా భావించి కొందరు స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఓ ట్రాన్స్‌జెండర్ మరణించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ ఒక ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ఏజెన్సీకి ఆయన సంవత్సరానికి రూ.6 కోట్లు చెల్లిస్తున్నారని పలు ప్రముఖ పత్రికల్లో వార్తలు రావడం గమనార్హం
కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న జేడీఎస్ పార్టీ గుణగణాలన్నీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో విద్యార్థులు చేరడానికి రాసిన ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎంసెట్) ఫలితాలు శనివారం సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నా.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రిసెప్షన్లకు, పార్టీలకు ఎక్కువగా చికెన్ సరఫరా జరగడంతో వాటి ప్రభావం ధరల మీద కూడా పడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడని నమ్మబలికి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరు యువకులను బురిడీ కొట్టించి రూ.70 లక్షలు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలు, వడగండ్లు, ఉరుములతో కూడిన వర్షాలు జోరుగా పడడంతో రాజధానిలో రహదారులు జలమయం అయ్యాయి.
సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2017 ఫలితాల్లో తెలుగు కీర్తి పతాకం వెల్లివిరిసింది. తెలంగాణ జగిత్యాల మెట్‌పల్లికి చెందిన అనుదీప్ దురిశెట్టి ఈ పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తెలుగు విద్యార్థుల సత్తాని జాతీయస్థాయిలో చాటాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.