తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగభగ మండుతున్నాడు. మధ్యాహ్నం పూట ఇంటి నుంచి జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్న వారిని ఉక్కపోత చంపేస్తోంది.
తెలంగాణ అంతటా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరుకున్నాయి. సూర్య ప్రతాపం కారణంగా పలు ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సూర్యపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలుగా నమోదయ్యాయి. దీంతో సూర్యతాపానికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
హైదరాబాద్ లో మాత్రం ఆదివారం నాడు 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ప్రస్తుతం సాధారణం కంటే రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..