Konda Surekha Fires On KTR: తెలంగాణలో రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. నాగ చైతన్య సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆరే అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉంది. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది హిరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆర్, డ్రగ్స్ వాళ్లకు కూడా అలవాటు చేశారు, రేవ్ పార్టీలు చేసుకుని బ్లాక్మెయిల్ చేశాడని మండిపడ్డారు ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు అని తాజాగా మంత్రి కొండా సురేఖ బాంబు పేల్చారు.
ఇదీ చదవండి: రైతులకు సీఎం రేవంత్ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..
మంత్రి కొండా సురేఖ బాపూఘాట్‌లోని గాంధీ జయంతి మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసింది కేటీఆర్. దొంగ పోస్టులు దుబాయి నుంచి పెట్టిస్తూ నన్ను ట్రోల్ చేశారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదు. బంధాల విలువలు నీకు తెలుసా? ఉన్నాయా? అంటూ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి: Bathukamma 2024: మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అనేకమంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నది కేటీఆర్ అని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు చాలామంది విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ కారణం. మొన్నటి వరకు మంత్రి సీతక్కను ట్రోల్ చేశారు. ఇప్పుడు తనను చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలంటేనే కేటీఆర్‌కు చిన్నచూపు. ఒక మహిళా మంత్రిని ట్రోల్ చేస్తే ఖండించే సంస్కారం కేటీఆర్‌కు లేదా? అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పార్టీలు తన పై రెచ్చిపోయి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. దుబాయి నుంచి బీఆర్ఎస్ పార్టీల సోషల్ మీడియా నడుపుతోందని మంత్రి ఆరోపించారు.
ఇలా చేయడానికి కేటీఆర్‌కు అమ్మ, అక్క, చెల్లి లేదా అంటూ ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు మానవతా దృక్పథంతో స్పందించారు కేటీఆర్‌కు ఆ మాత్రం సోయి లేదా? అని మండిపడ్డారు.మొన్న గిరిజన మంత్రిని నేడు బీసీ మహిళ అయిన తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.
నాగ చైతన్య సమంతలు ప్రేమించి పెళ్లిచేసుకుని ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిదే. ఆ మధ్య కాలంలోనే డైవర్స్‌కు ప్రధాన కారణం ఫోన్ ట్యాపింగ్ అని వినిపించాయి. ఒకవైపు సమంత సినిమాల్లో బిజీ అయిపోయింది. మరోవైపు నాగచైతన్య శోభితా దూళిపాళ్లతో రెండో వివహానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవలె వారికి నిశ్చితార్థం కూడా అయింది. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా నాగర్జున అధికారికంగా ధృవీకరించారు. ఇదిలా ఉండగా తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యాఖ్యలు మళ్లీ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Konda Surekha: నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్.. డ్రగ్స్‌కు అలవాటు పడి..: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..