Telangana Electricity Department Recruitment: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర యువతకు అదిరిపోయే న్యూస్ తెలిపింది. గత కొన్ని రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి భారీ రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖలో వివిధ సంబంధిత ఖాళీలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో.. ఏయే ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించబోతున్నారో? ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం విద్యు శాఖలోని కాళీ ఉన్న 3000కు పైగా ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వీలైనంత త్వరలో విడుదల కాబోతోంది. త్వరలోనే తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థతోపాటు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలలో వివిధ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.
ముఖ్యంగా ఈ రెండు విద్యుత్ కంపెనీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన కసరత్తు కూడా ముమ్మరమైంది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం ఉద్యోగాలు 3,260 భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఇక పోస్టులకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇందులోని మొదటి ప్రాధాన్యం కలిగిన జూనియర్ లైన్మెన్ సంబంధించిన 2,812 పోస్టులతో పాటు అసిస్టెంట్ ఇంజనీరింగ్ 118 పోస్టులు, సబ్ ఇంజనీరింగ్ 330 పోస్టులకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇక విద్యార్హత విషయానికొస్తే.. ముఖ్యంగా పదో తరగతితో పాటు ఐటిఐ పూర్తి చేసిన వారు ఇందులో కొన్ని పోస్టులకు అర్హులు అయితే.. ఇక పాలిటెక్నిక్‌తో పాటు డిప్లమా పూర్తి చేసిన వారు సబ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అర్హులవుతారని ఈ నోటిఫికేషన్ లో వెల్లడించే ఛాన్స్ ఉంది.. ఇక అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించిన ఉద్యోగాలను అప్లై చేసుకునే వారు తప్పకుండా BE లేదా B.Tech విద్యార్హత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు త్వరలోనే వెల్లడయ్యాడు ఛాన్స్ ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter