Tollywood couple Divorce: షాకింగ్.. విడాకుల బాటలో మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. !

Tollywood Heroine Divorce:  తెలుగు సహా సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంతో వేగంగా జరుగుతాయో.. విడాకులు అంతే తొందరగా జరిగిపోతూ  ఉంటాయి. ఇక్కడి బంధాలు నీటి రాతలే అని చెప్పాలి.  అందులో ఏదో కొద్ది మంది మాత్రమే తమ బంధాన్ని కలకాలం నిలుపుకుంటూ కాపురాలు చేస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన మరో హీరోయిన్ తన మొగుడికి విడాకులు ఇవ్వడానికి రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

1 /7

Tollywood Heroine Divorce: టాలీవుడ్ నటి స్వాతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 /7

అంతేకాదు తన నటనతో కేవలం తెలుగు ప్రేక్షకుల కాదు.. తమిళంలో కూడా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

3 /7

స్వాతి  2018లో తన ప్రియుడు వికాస్ వాసును ప్రేమించి పెళ్లి చేసుకొంది. మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. అయితే  స్వాతి గురించి ఓ వార్త సామాజిక వర్గాల్లో నెట్టింట వైరల్ అవుతోంది.

4 /7

తాజాగా స్వాతి కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన భర్తతో ఉన్న ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేయడంతో ఈ వాదనలకు బలం చేకూర్చినట్లైయింది.

5 /7

గతంలో సమంత, నాగ చైతన్య, నిహారిక, చైతన్య జొన్నలగడ్డ కూడా ఇదే విధంగా విడాకులకు ముందు ఇలాగే డైవోర్స్ కు ముందు ఇలాగే తమ జీవిత భాగస్వాములకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.

6 /7

గతంలో స్వాతి తన విడాకులకు సంబంధించి రూమర్స్ వచ్చాయి. అప్పట్లో తన భర్త ఫోటోలను డిలీట్ చేయడం చేయడంపై వివరణ ఇచ్చింది.

7 /7

ఈ సందర్భంగా స్వాతి తన ఆర్కైవ్ లో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను దాచిపెట్టుకుట్టున్నట్టు వివరణ ఇచ్చింది. మరి నిప్పు లేనిదే పొగ రాదు. మరి ఈ విషయమై ఏం జరుగుతుందో చూడాలి.