Pavitra Lokesh: మూడో భర్తకు అద్భుత బర్త్ డే గిఫ్ట్‌ ఇచ్చిన 'సినిమా ఆంటీ'

Pavitra Lokesh Bumper Gift To Her Third Husband VK Naresh: సినీ పరిశ్రమలో ఇప్పుడు ట్రెండింగ్‌లో పవిత్ర లోకేశ్‌, వీకే నరేశ్‌జంట ఉంది. ఈ జోడీ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన మూడో భర్త నరేశ్‌కు అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చారు. ఆయన జన్మదినం సందర్భంగా మరపురాని గిఫ్ట్‌ ఇచ్చినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. ఏమిచ్చారో తెలుసా?

1 /7

సినీ పరిశ్రమలో కలిసి పని చేసిన పవిత్ర లోకేశ్‌ వీకే నరేశ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం తర్వాత తొలిసారి నరేశ్‌ పుట్టిన రోజు జరిగింది.

2 /7

తన మూడో భర్త విజయ్‌ కృష్ణ నరేశ్‌ జన్మదినం జనవరి 20వ తేదీ కావడంతో ముందస్తు బర్త్‌ డే వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకల్లో నరేశ్‌, పవిత్ర సందడి చేశారు.

3 /7

నరేశ్‌కు బర్త్‌ డే సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చానని పవిత్ర లోకేశ్‌ చెప్పారు. అందరి ముందు నరేశ్‌కు ఇచ్చిన బహుమతి విషయాన్ని బయటపెట్టారు.

4 /7

పుట్టిన రోజు పుట్టినరోజుకు పవిత్ర లోకేశ్‌ 'పసుపు రంగు పూలచొక్కా' గిఫ్ట్‌గా ఇచ్చినట్లు నవ్వుతూ పవిత్ర లోకేశ్‌ తెలిపారు. ఈ వేడుకకు అదే చొక్కా వేసుకుని వచ్చారని ప్రస్తావించారు.

5 /7

పవిత్ర మాటలు విని నవ్వుకున్న నరేశ్‌ దగ్గరకు వచ్చి ఆమె భుజాలను పట్టుకుని అభినందిస్తూ వెనక్కి వెళ్లారు. అనంతరం మీడియా వాళ్లు కొన్ని సరదా ప్రశ్నలు వేశారు. ఓ మీడియా ప్రతినిధి 'మీరు పవిత్రకు చీర గిఫ్ట్‌గా ఇచ్చారా?' అని ప్రశ్నించగా నరేశ్‌, పవిత్ర నవ్వుకున్నారు.

6 /7

ఆ ప్రశ్నకు స్పందించిన వీకే నరేశ్‌ 'ఆ చీర కొనలేదు. కానీ ఆ చీర ధరించాలని నేనే చెప్పాను. ఈ చొక్కాకు మ్యాచింగ్‌గా ఉంటుందని చెప్పా' అంటూ సరదాగా నవ్వారు.

7 /7

ఈ ఈవెంట్‌ వేదికగా నరేశ్‌ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మొత్తం 9 సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. తన తల్లి విజయనిర్మల జయంతి వేడుకలు ఘనంగా చేస్తున్నట్లు వెల్లడించారు.