Pawan vs Lokesh: పవన్‌పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు, పనన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టనున్నారా

Pawan vs Lokesh: ఏపీలో రాజకీయాలు వేడెక్కే పరిణామాలు జరుగుతున్నాయి. తిరుపతి ఘటనలో  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఈ పరిస్థితి మరింత ముదురుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్‌పై నారా లోకేశ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 19, 2025, 12:34 PM IST
Pawan vs Lokesh: పవన్‌పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు, పనన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టనున్నారా

Pawan vs Lokesh: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలకే ఆధిపత్య పోరు మొదలైపోయింది. ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీ అండదండలతో దూకుడుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు అందుకు ఉదాహరణ. 

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్దికాలంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల లడ్డూ విషయంలో సనాతన అవతారం ఎత్తినప్పటి నుంచి తిరుపతి తొక్కిసలాట ఘటన, రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలంపై హోంమంత్రిన టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు అన్నీ ఏకపక్షంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలానే ఉంటే హోంశాఖను తాను తీసుకోవల్సి వస్తుందని చెప్పడం, సనాతనంతో మొత్తం తానే కేంద్రబిందువు కావడం తెలుగుదేశం అధినేతలకు నచ్చడం లేదని తెలుస్తోంది. తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబుకు కావల్సిన మనిషిగా ఉన్న టీటీడీ ఛైర్మన్ బీఆఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావులు క్షమాపణలు చెప్పాలని పవన్ కోరడం సంచలనమైంది. తొలుత క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించినా ఆ తరువాత టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. 

తాజాగా తిరుపతి వ్యవహారంపే పవన్ కళ్యాణ్ క్షమాపణలు కోరడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ క్షమాపణల డిమాండ్ తో టీడీపీకు సంబంధం లేదని నారా లోకేశ్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. ఈ వ్యాఖ్యలు హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదన గట్టిగా విన్పిస్తోంది. మిత్రపక్ష అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నారా లోకేశ్ కూడా ఉప ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ప్రాదాన్యత లేదా అధికారం తగ్గినట్టే. నారా లోకేశ్‌‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీ నేతలే ప్రతిపాదిస్తున్నారు. 

రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే నేరుగా కాకపోయినా నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టే ఆలోచనలో టీడీపీ యంత్రాంగం ఉంది.

Also read: Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన, చలితో జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News