తెలంగాణలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 189వ రోజు నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేపోయారని ఫైర్ అయ్యారు.
YS Sharmila comments CM KCR : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
SHARMILA COMMENTS: కడప ఎంపీ టికెట్ కోసమే తమ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన వారెవరో తెలియాలని, వారికి శిక్ష పడాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చిన షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడారు.
Sharmila on Kaleswaram project: రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గత కొంత కాలంగా షర్మిలా ఆరోపిస్తూ వస్తున్నారు.
YSRTP Sharmila : బోధన్ లో పాదయాత్ర సంధర్భంగా అక్కడి లోకల టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పై వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. దానికి సంబందించిన వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
YS SHARMILA: కాంగ్రెస్‌పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆమె ఆరోపించారు. 30 ఏళ్లు ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ను ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు
Ys Sharmila: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.
YS Sharmila: తెలంగాణలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. తనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.
YS Sharmila padayatra Updates: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. వికారాబాద్ నుంచి సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
Balakrishna comments on NTR health university name change issue: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై బాలయ్య బాబు ఘాటుగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
NTR Health University name change controversy : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రస్తుతం తెలుగు ప్రజలంతా చర్చించుకుంటున్న హాట్ టాపిక్స్ లో ఒకటి అని వేరేగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఏపీలో ప్రతిపక్షాల నేతలు ప్రస్తుతం సీఎం జగన్నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
YS Sharmila: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తెలుగు రాష్ట్రాల్లో దుమారం కొనసాగుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈనేపథ్యంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు.
YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్రలో ఉన్న షర్మిల.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆమెకు కౌంటర్ గా తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు.
TRS MLAs complaint on YS Sharmila: సీఎం కేసీఆర్, మంత్రులపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
YS Sharmila Takes a dig at Niranjan Reddy: తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించడం వారి మనోభావాలను దెబ్బతీసినట్టు ఎలా అవుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు.
Prajaprasthanam Padayatra : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 8 నుంచి పునఃప్రారంభం కానున్నట్లు పాద యాత్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ ప్రకటించారు. ఇకపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
గురుకుల పాఠశాలల్లో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కల్వకుర్తిలో చేరికలు, నెల్లూరులో బీజేవైఎం ఆందోళన, జాతీయ జెండాకు ఎమ్మెల్యే రేగా కాంతరావు అనుచరుల అవమానం తదితర సంఘటనల సంక్షిప్త వార్తా సమాహారం ఆల్ ఇన్ వన్ న్యూస్‌లో...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.