CST Tax Cancelled: ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే 2 శాతం సీఎస్టీ పన్ను బకాయిని రద్దుచేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందన్నారు.
CM KCR:తెలంగాణలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో దర్యాప్తు కోసం గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 51ను విడుదల చేసింది. ఆగస్ట్ 31నే తెలంగాణ హోం శాఖ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది.
Kodandaram : సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు టీజేఎస్ చైర్మెన్ కోదండరామ్. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో పాలన మారాలంటే ప్రతి ఒక్కరూ మళ్లీ ఉద్యమించాలని కోదండరామ్ పిలుపిచ్చారు. యువతపైనే ఆ బాధ్యత ఉందన్నారు.
Telangana secretariat: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించిన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది కేసీఆర్ సర్కార్. ఈ నేపథ్యంలోనే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
Kcr vs Governer:కొంత కాలంగా ప్రభుత్వానికి ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గవర్నర్ తమిళి సై వజ్రోత్సవ వేడుకల విషయంలోనూ దూకుడుగా వెళుతున్నారు. ఆగస్టు 9నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణి చేస్తుండగా.. అంతకు వారం రోజుల ముందే గవర్నర్ తమిళి సై ప్రారంభించేశారు.
Raghunandan Comments: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. రాష్ట్ర సర్కార్ తీరుపై కమలం నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
BANDI SANJAY: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లు, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. పల్లె ప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారు. అప్పులు చేసిన పనులు చేసిన కొందరు సర్పంచ్ లు .. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో రోడ్డున పడ్డారు. అప్పుల బాధ తాళలేక కొందరు సర్పంచ్ లు సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. కొందరు సర్పంచ్ లు భిక్షాటన చేశారు.
Tax Increase: ఇప్పటికే పరిమితికి మంచి అప్పులు... కొత్తగా రుణం దొరికే పరిస్థితి లేదు.. మే నెలాఖరు వచ్చేసింది.. మూడు రోజుల్లో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి.. కాని ఖజానా ఖాళీ.. జీతాలు చెల్లించాలంటే కొత్తగా అప్పు పుట్టాల్సిందే.. కాని కొత్త రుణం తీసుకోవడంపై కేంద్రం కొర్రీలు... ఇలాంటి దుర్భర ఆర్థిక పరిస్థితుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం
Rajanna Sircilla: గత ప్రభుత్వం ఇళ్లు కట్టుకునేందుకు ఇచ్చిన స్థలాల పట్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందనే ఆరోపణలతో.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కొంత మంది ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై న్యాయం కోసం రోడ్డెక్కారు. వారికి బీజేపీ మద్ధతు ప్రకటించింది.
New excise policy in Telangana: నవంబర్ 2న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు (Huzurabad bypolls results) రాగానే కొత్త మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
TPCC Chief Uttam Kumar Reddy | ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను బెదిరించి ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తూ రాజకీయాలు చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీకే చెందిన నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో రూ. 68 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని తెలంగాణ సర్కార్ చెప్పుకుంటోంది కానీ.. ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రభుత్వానికే సూటి ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు, దీంతోపాటు మరికొన్ని అంశాలపై చర్చించి చట్టాలు చేయాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలు, పలు అంశాలపై చర్చించేందుకు రెండు రోజులపాటు తెలంగాణ శాసనసభ సమావేశం (TS Assembly Session) కానుంది.
సంస్కరణలకు తెరతీసిన తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇటీవల వీఆరోఓ వ్యవస్ధను రద్దు చేసింది. దీని స్థానంలో నూతన రెవెన్యూ చట్టం (New Revenue Act Telangana) తీసుకొచ్చింది.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పించే లక్ష్యంతో బీజేపి ఈ సభను ఏర్పాటు చేస్తోంది. తొలుత మార్చి 7 లేదా 14 తేదీల్లో ఈ సభ నిర్వహించేందుకు వ్యూహం రచించినప్పటికీ.. ఆ తర్వాత మార్చి 15వ తేదీని ఫైనల్ చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.