Telangana secretariat: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు

Telangana secretariat: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించిన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది కేసీఆర్ సర్కార్. ఈ నేపథ్యంలోనే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Written by - Srisailam | Last Updated : Sep 15, 2022, 03:38 PM IST
  • కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు
  • కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం
  • పార్లమెంట్ కు పెట్టాలని డిమాండ్
Telangana secretariat: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు

Telangana secretariat: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించిన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది కేసీఆర్ సర్కార్. ఈ నేపథ్యంలోనే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు.  అయితే దీనిపై స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. పార్లమెంట్ గురించి తర్వాత మాట్లాడుదాం.. ముందు కొత్తగా కట్టిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సవాల్ చేశారు.

కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి  భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడుతూ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని చెప్పారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ స్పూర్తి లక్ష్యంగానే తెలంగాణ ప్రభుత్వం  ముందుకు సాగుతుందన్నారు కేసీఆర్. అంబేద్కర్ రూపొందించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యిందన్నారు  ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తుందని కేసీఆర్ తెలిపారు.

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రికి త్వరలోనే లేఖ రాస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డా. బిఆర్  అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

Also read: KTR TARGET BJP: విశ్వ గురు వద్దంటారు.. ఆయన శిష్యుడేమో ఇస్తానంటారు! ఉచితాలపై బీజేపీని ఉతికిఆరేసిన కేటీఆర్..

Also read: AP Cabinet: కేబినెట్‌లో స్థానం కోల్పోతున్న ఆ మహిళా మంత్రి ఎవరు, ఆ ఇద్దరికీ మళ్లీ ఛాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News