BANDI SANJAY: కేసీఆర్ సర్కార్ వేధింపులకు బయపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు ! సర్పంచ్ లకు బండి సంజయ్ బహిరంగ లేఖ..

BANDI SANJAY: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లు, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. పల్లె ప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారు. అప్పులు చేసిన పనులు చేసిన కొందరు సర్పంచ్ లు .. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో రోడ్డున పడ్డారు. అప్పుల బాధ తాళలేక కొందరు సర్పంచ్ లు సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. కొందరు సర్పంచ్ లు భిక్షాటన చేశారు.

Written by - Srisailam | Last Updated : May 31, 2022, 11:19 AM IST
  • గ్రామ సర్పంచ్ లకు సంజయ్ బహిరంగ లేఖ
  • సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి- సంజయ్
  • వేధింపులకు బయపడొద్దు.. ఆత్మహత్యలు వద్దు- సంజయ్
BANDI SANJAY: కేసీఆర్ సర్కార్ వేధింపులకు బయపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు ! సర్పంచ్ లకు బండి సంజయ్ బహిరంగ లేఖ..

BANDI SANJAY: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లు, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. పల్లె ప్రగతి బిల్లులు చెల్లించాలని సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారు. అప్పులు చేసిన పనులు చేసిన కొందరు సర్పంచ్ లు .. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో రోడ్డున పడ్డారు. అప్పుల బాధ తాళలేక కొందరు సర్పంచ్ లు సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. కొందరు సర్పంచ్ లు భిక్షాటన చేశారు. పాత బిల్లులు ఇవ్వకుండానే ఐదో విడత పల్లె ప్రగతి నిర్వహణకు సిద్ధమైంది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో సర్పంచ్ లు నిరసనబాట పట్టారు. అధికార పార్టీ సర్పంచ్ లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. పాత బిల్లులు పూర్తిగా క్లియర్ చేస్తేనే పల్లె ప్రగతి నిర్వహిస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో సర్పంచ్ లపై కేసీఆర్ ప్రభుత్వం వేధింపులకు దిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.  పల్లె ప్రగతికి సహకరించకపోతే పాత బిల్లులు ఇచ్చేది లేదని అధికారులు  బెదిరిస్తున్నారని సర్పంచ్ లు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డున పడ్డ గ్రామ సర్పంచ్ లకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గ్రామ సర్పంచ్‌లకు మూడు పేజీల లేఖ రాసిన సంజయ్.. అందులో రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. 73, 74 రాజ్యాంగ అధికరణలకు టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. గ్రామాల స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లక్ష్యమని చెప్పారు. న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే ఆందోళనలకు బిజెపి సంపూర్ణ మద్దతు ఇస్తుందని బండి సంజయ్ ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ల పట్ల జిల్లా అధికారుల వేధింపులు ఆపాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు.

గ్రామాలకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు, గ్రామ సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ కోసం త్వరలోనే బిజెపి శాఖ మౌనదీక్ష చేపడుతుందని సంజయ్ తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు.  2014 లో టీఆర్‌ఎస్‌ పార్టీ ‘‘గ్రామీణాభివృద్ధి ` పంచాయతీరాజ్‌ వ్యవస్థ’’ అనే అంశం కింద ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడవద్దు, అధైర్యపడవద్దని సంజయ్ సూచించారు. బీజేపీ అండగా ఉంటుందని సర్పంచ్ లకు ఆయన భరోసా ఇచ్చారు. గ్రామసర్పంచ్‌లు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు సగర్వంగా తలెత్తుకునేలా చేసే బాధ్యత బీజేపీ పార్టీదే అన్నారు.  గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం ... గ్రామస్వరాజ్యం సాదిద్దాం ... రామరాజ్యాన్ని నిర్మించుకుందామని తన బహిరంగ లేఖలో సర్పంచ్ లకు పిలుపిచ్చారు బీజేపీ చీఫ్ బండి సంజయ్.

READ ALSO: Revanth Reddy: అమెరికాలో రేవంత్... హైదరాబాద్ లో భట్టీ మీటింగ్! కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?  

READ ALSO: MLC Kavitha: ఉద్యోగ కల్పనలో శ్రీలంకతో పోటీ.. మోడీ సర్కార్ ఫెయిల్ అన్న కవిత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News