New Pensions: మునుగోడు బైపోల్ ఎఫెక్ట్.. ఈ నెల నుంచే 10 లక్షల కొత్త పెన్షన్లు..

New Pensions:హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగానే దళిత బంధు స్కీం ప్రకటించారు సీఎం కేసీఆర్. విపక్షాలు విమర్శిస్తున్నట్లే తాజాగా తెలంగాణ సర్కార్ నిర్ణయాలు తీసుకుంది.కొత్త పెన్షన్లకు మోక్షం కల్గింది.  

Written by - Srisailam | Last Updated : Aug 12, 2022, 09:40 AM IST
  • తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
  • కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు
  • మునుగోడు ఉపఎన్నికే కారణమా?
New Pensions: మునుగోడు బైపోల్ ఎఫెక్ట్.. ఈ నెల నుంచే 10 లక్షల కొత్త పెన్షన్లు..

New Pensions: తెలంగాణలో కొత్త పథకాలు, సంక్షేమ పథకాలు కొత్తగా ఇవ్వాలన్న ఉప ఎన్నికలు రావాలని కొన్ని రోజులుగా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. గత ఏడాది జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గం దశ మారిందని చెబుతున్నారు. ఏడేండ్లుగా ఎన్నిసార్లు విన్నవించినా జరగని అభివృద్ది పనులు.. బైపోల్ పుణ్యానా నెల రోజుల్లోనే జరిగిపోయాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగానే దళిత బంధు స్కీం ప్రకటించారు సీఎం కేసీఆర్. విపక్షాలు విమర్శిస్తున్నట్లే తాజాగా తెలంగాణ సర్కార్ నిర్ణయాలు తీసుకుంది. గత నాలుగేళ్లుగా తెలంగాణలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వంపై జనాలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే తాజాగా కొత్త పెన్షన్లకు మోక్షం కల్గింది.

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగష్టు 15వ తేదీ నుంచి కొత్తగా 10 లక్షల ఆసరా ఫించన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పటికే 36 లక్షల మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నారు.  తాజాగా 10 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించడంతో రాష్ట్రంలో మొత్తం పెన్షన్ల సంఖ్య 46 లకలకు చేరనుంది. కొత్తవారికి సెప్టెంబరు నుంచి ఫించను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఫించన్ కోసం ఎప్పుడో ధరఖాస్తు చేసుకున్న ప్రజలు.. గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కేసీఆర్ సర్కార్ కరుణించింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు మంజూరు చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ప్రగతి భవన్ లో దాదాపు ఐదు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోఠి ఈఎన్ టి ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేసింది. అధునాతన సౌకర్యాలతో ఈఎన్ టి టవర్ నిర్మించాలని నిర్ణయించింది. సరోజినీదేవి కంటి హాస్పిటల్లో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని వైద్య ఆరోగ్యశాఖను మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 వేల 111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జీవో 58, 59 కింద పేదలకు స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామకంఠం భూముల్లో  ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో ఒక కమిటీ వేసి.. 15 రోజుల్లోగా నివేదిక తీసుకొని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయించింది.

Also Read: Macherla Niyojakavargam: అమెరికా ప్రీమియర్ షోలన్నీ రద్దు.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News